Kannappa Film Leaked: సాధారణంగా సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమాను చిత్రీకరించి, థియేటర్లలో విడుదల చేసేవరకూ కంటిమీద కునుకు లేకుండా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. కారణం లీక్ ల బెడద. సినిమా అనౌన్స్మెంట్ అయిన రోజు నుంచి విడుదల అయ్యేవరకు.. ఎలాంటి లీకులు బయటపడకుండా చిత్ర బృందం ఎంత జాగ్రత్త తీసుకున్నా.. ఏదో ఒక పోస్టర్ లేదా ఏదో ఒక సన్నివేశం ఇలా లీక్ రూపంలో బయటకు వచ్చి నిర్మాతలకు తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు మాత్రం ఒక సినిమా మొత్తాన్ని ఏకంగా ఆన్లైన్లో అందులోనూ హెచ్డి ప్రింట్ తో లీక్ చేయడం సంచలనంగా మారింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. విడుదలై ఒక్క రోజు కాకముందే అప్పుడే ఆన్లైన్ లోకి రావడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో కన్నప్ప మూవీ హెచ్డీ ప్రింట్ లీక్..
అసలు విషయంలోకి వెళ్తే.. మంచు విష్ణు (Manchu Vishnu)ఎంతో పగడ్బందీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం కన్నప్ప (Kannappa). జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్.. మరొక వర్గం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. టాక్ పరంగా ఎలా ఉన్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లలో విడుదలై 24 గంటలు ముగిసేలోపే సినిమా మొత్తం ఆన్లైన్ లో లీక్ అయింది. అందులోను హెచ్డీ ప్రింట్ తో లీక్ అవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయం చిత్ర బృందానికి భారీ షాక్ అని చెప్పవచ్చు.
కఠిన చర్యలు తప్పవా?
అసలే ఈ సినిమా రివ్యూయర్ల పై.. ముందస్తు జాగ్రత్తగా గానే నోటీస్ విడుదల చేసిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ.. ఇప్పుడు ఏకంగా సినిమానే ఆన్లైన్ లో లీక్ చేశారు. మరి వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే సినిమా రెండు రోజుల్లో విడుదలవుతుందనగా.. మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ద్వారా ఒక హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. అందులో సినిమాను చూసిన తర్వాత మాత్రమే నచ్చకపోతే నెగిటివ్ కామెంట్ ఇవ్వాలి అని.. అనవసరంగా నెగిటివ్ రివ్యూలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడేకంగా సినిమానే లీక్ చేశారు.
కన్నప్ప సినిమా విశేషాలు..
మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల ఇలాంటి భారీ తారాగణం ఇందులో భాగమయ్యారు. అయితే ఇక్కడ ప్రభాస్ తప్ప ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు అని ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
also read:Kannappa Movie : వేస్ట్ సినిమా.. రూ.5 లక్షలు ఇస్తే దీని కంటే బెటర్ తీస్తా!