Honor Robotic Camera| ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ టెక్ ప్రపంచానికి షాకిచ్చింది. కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి రోబోటిక్ ఫోన్. ఈ ఫోన్‌లో అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రోబోటిక్స్‌తో మిక్స్ చేసింది. దీని సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి కొత్త కాన్సెప్ట్ ఫోన్ ఫీచర్లను చూపించింది. వీడియోలో ఫోన్ ప్రత్యేక సామర్థ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొబైల్ టెక్నాలజీలో ఇది ఒక పెద్ద అడుగు.
ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దీని కెమెరా. ఒక చిన్న రోబోటిక్ కెమెరా.. ఫోన్ నుంచి బయటకు వచ్చి మరీ ఫొటోలు తీస్తుంది. ఈ కెమెరా ఒక గింబాల్ లాంటి రోబో లాగా ఏ దిశలోనైనా కదులుతుంది. దీని సహాయంతో వివిధ కోణాల నుండి ఫోటోలు తీసుకోవచ్చు. కెమెరా ఎక్కువ సమయం బయట ఉండదు. వీడియో, ఫొటో షూటింగ్ అయిపోయిన వెంటనే కెమెరా.. ఫోన్ బాడీలోకి తిరిగి ఆటోమెటిక్ గా వెళుతుంది. 2025 అక్టోబర్ 15న హానర్ మ్యాజిక్ 8 సిరీస్ లాంచ్ సమయంలో ఈ కాన్సెప్ట్ ఫోన్ టీజర్‌ని విడుదల చేశారు.
ఈ డివైస్‌లో ఉన్న ఏఐ రోబోటిక్ కెమెరా ఇంటెలిజెంట్ ఫోటోగ్రాఫర్. ఉదాహరణకు, ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి కెమెరా బెస్ట్ ఫోటో కోణాలను వెతుకుతుంది. కెమెరా మీ పర్ఫెక్ట్ మూమెంట్‌లను క్యాప్చర్ చేస్తుంది. మీరు ఏ పోజ్ లో అందంగా కనిపిస్తారో ఆటోమెటిక్‌గా కనిపెట్టి మరీ ఫొటోలు తీస్తుంది. యూజర్ మూవ్‌మెంట్ ప్రకారం స్మార్ట్‌గా రెస్పాండ్ అవుతుంది. మీరు నడుస్తున్నప్పుడు కూడా ఫోటోలు తీసుకోవచ్చు. AIతో కెమెరా మూవ్ చేసి షాట్‌లు టేక్ చేస్తుంది. పిల్లలతో పీకబూ ఆడుతుంది.
ఫోన్ యూజర్లతో ఇంటరాక్ట్ అవ్వడం పూర్తిగా ఇన్నోవేటివ్. డివైస్ యూజర్ బాడీ లాంగ్వేజ్, జెస్చర్‌లను చదువుతుంది. ఆ అనాలిసిస్ ఆధారంగా రెస్పాన్స్ ఇస్తుంది. ఇది రియల్ అసిస్టెంట్‌గా మారుతుంది. మంచి ఫొటోలు తీసేందుకు వాయిస్ కమాండ్ ఇచ్చినా అంతకంటే మంచి పోజులను చూపిస్తుంది. వాయిస్ కమాండ్ కంటే ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. ఈ ఎమోషనల్ కనెక్షన్ ఫోన్‌ను కంప్యానియన్‌గా మారుస్తుంది.
2026లో హానర్ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు. రాబోయే సంవత్సరంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో వివరాలు హారన్ షేర్ చేస్తుంది. కంపెనీ దీన్ని రియల్ డివైస్ ప్రాజెక్ట్ అని చెబుతోంది. ఇది కేవలం థియరిటికల్ కాన్సెప్ట్ కాదు. కామర్షియల్ ప్రొడక్ట్‌గా మారడం తదుపరి స్టెప్. టెక్ వరల్డ్‌లో చాలా మంది ఈ అనౌన్స్‌మెంట్‌పై ఆసక్తిగా ఉన్నారు. MWC 2026లో బార్సిలోనాలో మరిన్ని వివరాలు బయటపడతాయి.
ఈ ఇన్వెన్షన్ మొత్తం స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో విప్లవం తీసుకురావొచ్చు. ఇతర కంపెనీలు కూడా హానర్ టెక్నాలజీని ఫాలో చేయవచ్చు. ఫోన్‌లకు రోబోటిక్ టెక్నాలజీ యాడ్ చేయబడుతుంది. డివైస్ ఫంక్షనాలిటీ లిమిట్‌లను పుష్ చేస్తుంది. ఇకపై ఫోన్లు ఏఐ సెంట్రిక్ గా తయారు చేయబడతాయి.
Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?