Tirumala News: తిరుమల పేరు చెప్పగానే మనసు పులకరిస్తుంది. శ్రీవారిని ఎప్పుడు చూద్దామా? అనే ఆలోచన టక్కున వస్తుంది. నిత్యం స్వామిని 70 వేల నుంచి 80 వేల మంది దర్శించుకుంటున్నారు. దర్శనానికి వెళ్లినవారు కొందరైతే.. దర్శనం తర్వాత ఇంటికి వెళ్లేవారు చాలామంది ఉంటాయి. అయినా టికెట్లు, వసతి దొరక్క అక్కడ చాలామంది పడిగాపులు కాస్తుంటారు. దర్శనం టికెట్లు దొరక్క చాలామంది వెయింటింగ్‌లో ఉంటారు. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోతున్నారు. తిరుమలను టార్గెట్‌గా చేసుకుని రకరకాల పోస్టులు పెడుతున్నారు.
తప్పుడు వార్తలపై టీటీడీ సీరియస్
తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడినా, టీటీడీ గురించి తప్పుడు ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని పదేపదే ఛైర్మన్ బీఆర్ నాయుడు చెబుతున్నారు. అయినా కొందరు ఏ మాత్రం వినలేదు. అదే పనిగా కొందరు పదే పదే తప్పుడు చేస్తున్నారు. కొద్దిరోజులుగా తిరుమల గురించి రకరకాల వార్తలు సర్య్కులేట్ అవుతున్నాయి.
దర్శనం, భోజనం, లడ్డూ రకరకాల వాటి గురించి సోషల్ మీడియాలో వార్తలు సర్య్కులేట్ అవుతున్నాయి. ఓ వైపు వాటిని ఖండిస్తూనే ఉంది టీటీడీ. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తిరుమల అన్నప్రసాదంపై చిత్రీకరించిన వీడియోను తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేశాడు. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఆ వ్యక్తిపై కేసు కూడా నమోదు అయ్యింది.
లడ్డూ ధర పెంచే ఆలోచన లేదు
ఈ వ్యవహారం జరుగుతుండగా తిరుమల గురించి రకరకాల వార్తలను వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. టీటీడీ, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని మీడియా ఛానెల్‌లు ప్రయత్నిస్తున్నాయని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
భక్తుల మనోభావాలతో ముడిపడిన ఆంశాలపై జాగ్రత్త లేకుండా అబద్దపు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ధర పెంచాలని టీటీడీ ఆలోచిస్తోందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేయడంపై మండిపడ్డారు. తిరుమల లడ్డూ ధర పెంచే ప్రణాళిక టీటీడీకి లేదని పునరుద్ఘాటించారు ఛైర్మన్ బీఆర్ నాయుడు.
ALSO READ: లోకేష్ కోడిగుడ్డు కామెంట్స్.. అమర్నాథ్ అంతగా ఫీలయ్యారా?
భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయబోమన్నారు. తప్పుడు వార్తలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుమలపై బురద చల్లే ప్రయత్నంలో కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని రాసుకొచ్చారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.