Big tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks) కార్యక్రమంలో భాగంగా సినీనటి హరితేజ(Hariteja) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా హరితేజ తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగతం విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కాలంలో హరితేజ బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెరకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నించారు. కేవలం బుల్లితెరపై మాత్రమే పరిమితం కాకూడదని సినిమాలు కూడా చేస్తున్నానని సినిమా అవకాశాలు రావడంతోనే బుల్లితెరకు దూరమవుతున్నానని వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ గురించి కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది అనంతరం వర్ష మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు హరితేజ సమాధానం చెప్పు తనకు శివయ్య (Lord Shivayya)అంటే చాలా ఇష్టమని నాకే కష్టం వచ్చినం ముందు నేను శివయ్య తోనే చెప్పుకుంటానని తెలిపారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం నుంచి కూడా బయటకు వచ్చిన వెంటనే తాను కాశి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఇక శివుడు అంటే అంత ఇష్టమున్న నీకు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకో అంటే ఏం అడుగుతావని ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు హరితేజ సమాధానం చెబుతూ నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు శివయ్య అంటూ కోరుకుంటానని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. హరితేజ ఈ సమాధానం చెప్పడంతో వర్ష అదేంటి అంటూ ఆశ్చర్యపోయారు. తీసుకెళ్లిపో అంటే చనిపోవాలని కాదు శివయ్య తోడుగా ఉంటే చాలు ఇంకెవరు అవసరం లేదు అనే విధంగా భక్తులను తన లీలలతో పట్టేసుకుంటారు అందుకే ఆయనని బోలా శంకరుడు అంటారు అంటూ శివుడి పట్ల తనకున్నటువంటి భక్తిని బయటపెట్టారు.
ఇక అమ్మాయిలు గురించి కూడా మాట్లాడుతూ అమ్మాయిలను ప్రకృతితో పోలుస్తారు ప్రకృతిని కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది అలాగే అమ్మాయిలను కాపాడితే ఈ సొసైటీ కూడా బాగుంటుంది అని తెలిపారు. ఇక జీవితంలో వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్ గురించి కూడా ఈ సందర్భంగా హరితేజ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జీవితంలో కింద పడిపోతేనే పైకి ఎలా లేవాలో తెలుస్తుంది..ఫెయిల్యూర్ వస్తేనే కదా సక్సెస్ కూడా వస్తుంది అంటూ కొన్ని స్ఫూర్తిని కలిగించే విషయాలు గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఇంకా ఎలాంటి విషయాలు గురించి ప్రస్తావనికు వచ్చాయనేది తెలియాలి అంటే శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీ ప్లస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: Big tv Kissik Talks: బుద్దుంటే ఆపని చెయ్యను.. బిగ్ బాస్ పై ఫైర్ అయిన హరితేజ!