Fake liquor Case: కల్తీ మద్యంపై మాజీ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. పర్మిట్ రూమ్ పేరిట నగరాల్లో ఒక్కో వైన్ షాపుకి ఏడు లక్షలు, మున్సిపాలిటీల్లో ఐదు లక్షల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికిదోడు మళ్లీ క్యూఆర్ కోడ్ పేరుతో మరో కొత్త డ్రామాకు తెర లేపారని విమర్శలు గుప్పించారు.
నకిలీ మద్యం మీరంటే మీరు
కల్తీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది సిట్. పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు గురించి పూర్తి డీటేల్స్ తీసుకుంది. ఇప్పటివరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా అందులోని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. దీని ఆధారంగా రేపో మాపో కొందరి వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ వ్యవహారంలో తన పేరు వచ్చిన నుంచి ప్రతీరోజు మాజీమంత్రి జోగి రమేష్ మీడియా ముందుకొస్తూనే ఉన్నారు. ఆయన చెప్పాల్సిన విషయాలు చెబుతున్నారు. దేవుని ఎదుట ప్రమాణానికి తాను రెడీ అని, సీఎం కూడా సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. లేటెస్టుగా హైకమాండ్ ఆదేశాలతో మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం మీడియా ముందుకొచ్చారు.
తాము క్యూఆర్ కోడ్ తెచ్చామని వైసీసీ నేతల మాట
అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నిందితుడు జనార్థన్‌తో వీడియో చేయించారని ఆరోపించారు. జనార్థన్‌తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. గతంలో తాను క్యూఆర్ అమలు చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.
కేవలం నకిలీ మద్యాన్ని అమ్మడం కోసమే దాన్ని ఎత్తేశారని, ఏడాదిన్నర తర్వాత ఎందుకు తెచ్చారని ప్రశ్నలు లేవనెత్తారు. నకిలీ మద్యం వ్యవహారం చేయి దాటి పోతుందని ఒక్కకారణంతో క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి.
ALSO READ: విశాఖపై రహేజా సంస్థ ఫోకస్, కాకపోతే..
పర్మిట్ రూమ్ పేరిట నగరాల్లో ఒక్కో వైన్ షాపుకి ఏడు లక్షలు, మున్సిపాలిటీల్లో ఐదు లక్షల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు పెట్టారని విమర్శించారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలుంటే అన్నింటికీ పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులున్నాయని, వాటి ద్వారా నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు.
మొత్తానికి జోగి రమేష్, సజ్జల, పేర్నినాని వంటి నేతలు నకిలీ మద్యానికి కూటమి కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి సిట్ దర్యాప్తు చేస్తుంటే ఎందుకు ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని అధికార పార్టీ నుంచి కామెంట్స్ పడిపోతున్నాయి.
కల్తీ మద్యంపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతూ వస్తోంది
పర్మిట్ రూమ్ పేరిట నగరాల్లో అయితే ఒక్కో వైన్ షాపుకి రూ.7 లక్షలు, మున్సిపాలిటీల్లో అయితే రూ.5 లక్షల చొప్పున వసూల్ చేస్తున్నారు
ఇప్పుడు… pic.twitter.com/N5WDtphMei
— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2025