Dude Movie Review in Telugu: ‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాల హీరో ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ బ్యూటీ మామితా బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘డ్యూడ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
గగన్(ప్రదీప్ రంగనాథన్) మావయ్య(శరత్ కుమార్) కూతురు కుందన(మామితా బైజు) చిన్నప్పటి నుండి వీళ్ళు కలిసి పెరుగుతారు. గగన్ ‘సర్ప్రైజ్ డ్యూడ్’ పేరుతో ఓ బిజినెస్ చేస్తూ ఉంటాడు. కుందన కూడా ఆ బిజినెస్లో అతనికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు కుందన.. గగన్ ని లవ్ చేస్తున్నట్టు చెప్పి సర్పైజ్ చేయాలనుకుంటుంది. కానీ చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వల్ల తనపై ఎటువంటి ఫీలింగ్స్ లేవని చెప్పి ఆమె ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. దీంతో ఆమె ఉన్నత చదువుల కోసం వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆమె లేని లోటుని ఫీలైన గగన్.. కుందనని తెలీకుండానే ప్రేమిస్తున్నట్టు గమనిస్తాడు. ఇదే విషయం వాళ్ళింట్లో వాళ్లకి చెప్పి.. వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అదే టైంలో వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పి.. గగన్ కి షాక్ ఇస్తుంది కుందన.
ఆమె ప్రేమను అర్ధం చేసుకున్న గగన్.. తన ప్రేమించిన అబ్బాయి గురించి వెళ్లి తన తండ్రితో చెప్పమని చెబుతాడు. కానీ అతనికి క్యాస్ట్ పిచ్చి. అనాధ అయినా పర్వాలేదు.. కానీ వేరే క్యాస్ట్ వ్యక్తికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అతనికి ఇష్టపడడు.కాదని పెళ్లి చేసుకుంటాను అంటే చంపడానికి సిద్ధం అని చెబుతాడు. అంతేకాదు చిన్నప్పుడు ఇలాగే వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని భావించి.. సొంత చెల్లెల్ని కూడా చంపేస్తాడు. మరి ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కలిగిన తండ్రి భారి నుండి రక్షించి… కుందనని ప్రేమించిన వ్యక్తితో గగన్ ఎలా కలిపాడు అనేది మిగిలిన కథ.
ఈ దీపావళికి కచ్చితంగా ‘డ్యూడ్’ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే థియేటర్ కి వెళ్లి కూర్చుంటాడు ప్రేక్షకుడు. అతని అంచనాలకు తగ్గట్టు ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మొదలైనప్పటి నుండి ఆడియన్స్ కి ఒక జుగుప్సాకరమైన ఫీలింగ్ మొదలవుతుంది. క్రమ క్రమంగా అది పెరుగుతూనే ఉంటుంది తప్ప.. ఎక్కడా తగ్గదు. ‘ఆర్య 2′ కన్యాదానం’ ‘శుభాకాంక్షలు’ ‘నిన్నుకోరి’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చూసిన స్టోరీ లైన్ నే దర్శకుడు తీసుకుని జెంజి కిడ్స్ ని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దారుణంగా తీశాడు.
‘ఎవరిని ప్రేమించానో తెలీని కన్ఫ్యూజన్లో ఉన్నట్టు’ హీరోకి చెప్పి సూసైడ్ చేసుకోబోయిన హీరోయిన్.. తనకు పెళ్ళైనప్పటికీ బాయ్ ఫ్రెండ్ తో ఎప్పుడు తొందరపడింది? పిల్లాడిని ఎలా ప్రెగ్నెన్సీ ఎప్పుడు ధరించింది? వినడానికి ఈ లైన్ చాలా వరస్ట్ గా అనిపిస్తుంది కదా. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఇలానే ఉంటుంది. అంతేకాదు హీరో తల్లి హీరోయిన్ తండ్రికి చెల్లెలి అవుతుంది. కానీ అతన్ని ఒక అతనిపై కోపం ఉన్నట్టు తెలిపి అతనితో మాట్లాడదు. దానికి కారణం ఏంటి అనేది ఎండ్ టైటిల్స్ పడినప్పుడు కూడా క్లారిటీ ఇవ్వడు దర్శకుడు కీర్తీశ్వరన్. ఇలాంటి లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతన్ని ఒక రేంజ్లో లేపారు. అంతలా ఎందుకు లేపారో మేకర్స్ కే తెలియాలి. టెక్నికల్ గా ‘డ్యూడ్’ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ వంటివి బాగున్నాయి.
ప్రదీప్ రంగనాథన్ తన మార్క్ నటనతో మెప్పించాడు. మామితా బైజు ‘ప్రేమలు’ రేంజ్లో తన నటనతో మ్యాజిక్ చేయలేకపోయింది. శరత్ కుమార్ పాత్ర కీలకంగా ఉంది. రోహిణి తన వరకు బాగానే చేసింది.నేహా శెట్టి అతిధి పాత్రలో పర్వాలేదు అనిపిస్తుంది. కమెడియన్ సత్య అక్కడక్కడా కనిపించాడు.. కానీ కామెడీ పండించే స్కోప్ అతనికి ఇవ్వలేదు. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.
ఫస్ట్ హాఫ్ ‘
ప్రదీప్ రంగనాథన్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
పాత కథ
డైరెక్షన్
సెకండాఫ్
రొటీన్ క్లైమాక్స్
మొత్తంగా ‘డ్యూడ్’ ఎన్నో ఆశలు పెట్టుకుని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో విఫలమైంది.
రేటింగ్ : 2/5