Raj Bhavan: హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద రాష్ట్ర సీపీఎం నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం నాయకులు, గవర్నర్ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చే వరకు రాజ్ భవన్ మెయిన్ గేటు ముందే బైఠాయించారు. గవర్నర్ నిబంధనలు పాటించాలని వారు డిమాండ్ చేశారు. గవర్నర్ తమను కలవడానికి అంగీకరించే వరకు తాము అక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పారు.
గవర్నర్ నిర్లక్ష్య వైఖరి.. సీపీఎం నేతల ఆరోపణ
అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో గవర్నర్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. గవర్నర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సంచలన విమర్శలు చేశారు.
ALSO READ: Kavitha New party: కవిత సోలో అజెండా.. ప్రజల్లోకి వెళ్లడానికి 4 నెలల షెడ్యూల్
గవర్నర్ తీరుకు నిరసనగా.. సీపీఎం నిరసన కార్యక్రమాలు
గవర్నర్ తీరుకు నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సీపీఎం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చిన బీసీ సంఘాలు..
రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ కు బీసీ సంఘాలు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే..తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు. రేపటి రాష్ట్ర బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సీపీఐ నుంచి కూడా మద్దతు లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్ల డిమాండ్‌కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని, రిజర్వేషన్ల అంశం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
ALSO READ: Naveen Yadav: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్..