Bus Fire: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు నుంచి రాజూరు వైపుగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. తర్వాత ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సులో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సులోని ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో మెుత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.