Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమం బిగ్ బాస్(Bigg Boss). ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది .ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా కొంతమంది పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సినీనటి హరితేజ(Hari Teja) కూడా ఒకరు.
హరితేజ బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అలాగే సీజన్ 8 తెలుగు కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన హరితేజ తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హరితేజ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు .ఇందులో భాగంగా వర్ష హరితేజ మధ్య బిగ్ బాస్ గురించి ప్రస్తావనకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తిరిగి మరోసారి బిగ్ బాస్ కి వెళ్ళాలి అని కోరిక ఉండేది. ఎప్పుడైతే సీజన్ 8 కార్యక్రమానికి వెళ్ళానో మరోసారి బుద్ధుంటే ఈ కార్యక్రమంలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఇప్పుడు కనుక మీకు సీజన్9 లో అవకాశం వస్తే వెళ్తారా? అనే ప్రశ్న కూడా ఎదురవడంతో సాధారణంగా అందరూ తూర్పుకు తిరిగి దండం పెట్టుకుంటారు నేను నలుమూలలా తిరిగి దండం పెట్టుకొని ఈ కార్యక్రమానికి వెళ్ళనని చెబుతాను అంటూ ఈమె మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. అసలు బిగ్ బాస్ కార్యక్రమం గురించి హరితేజ ఎందుకు ఇలా మాట్లాడారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రసార సమయంలో ఎన్టీఆర్ హరితేజ మధ్య ఎప్పుడు సరదాగా గొడవ జరుగుతూ ఉండేది.
ఈ విషయాన్ని ఇప్పటికీ ఎన్టీఆర్ మర్చిపోలేదని దేవర సినిమాలో తనకు చాన్స్ ఇవ్వడంతో కొరటాల గారి దగ్గరికి వెళ్లి ఈ అమ్మాయికి ఎందుకు అవకాశం ఇచ్చారు తనకు అసలు యాక్టింగ్ రాదు ఊరకనే అరుస్తూ ఉంటుంది అంటూ నా మీద కంప్లైంట్ చేశారని హరితేజ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడారు.. ఏది ఏమైనా హరితేజ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో హరితేజ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఇలా మాట్లాడారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక హరితేజ ఈ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారని తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: Yellamma Movie: హమ్మయ్య.. వేణు ఎల్లమ్మకు హీరో దొరికేసినట్టేనా.. హీరోగా దేవిశ్రీప్రసాద్?