దీపావళి సందర్భంగా డిమార్ట్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే ప్రీ దీపావళి సేల్ ను ప్రారంభించగా, ఇప్పుడు దీపావళి ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ సేల్ లో 50 శాతం నుంచి 80 శాతం వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. గృహోపకరణాల నుంచి దీపావళి అలంకరణల వరకు ప్రతిదీ సగం ధరకే లభిస్తుంది. నిత్యావసర సరుకుల నుంచి గృహోపకరణాల వరకు క్రేజీ డీల్స్ అందిస్తున్నది. పండుగ సీజన్ లో తక్కువ ధరలకే ఆయా వస్తువులను అందుబాటులో ఉంచడంతో కొనుగోలుదారులు పోటెత్తుతున్నారు.
దీపావళి సందర్భంగా నిత్యవసరాలపై భారీగా తగ్గింపు అందిస్తుంది డిమార్ట్. బియ్యం, నూనె, సుగంధ ద్రవ్యాలపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. తాజా కూరగాయలు, నిల్వ చేసిన పండ్లు, స్థానిక రైతుల నుండి సేకరించిన పండ్ల మీద 30 శాతం నుంచి 40 శాతం వరకు ఆఫర్ అందిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, స్వీట్లు 56 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష పైనా క్రేజీ ఆఫర్స్ అందిస్తుంది.
దీపావళి వేళ గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంది డిమార్ట్. కిచెన్ వేర్, బెడ్ షీట్లు, దీపాలు, రంగోలి పౌడర్లపై 60 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. విద్యుత్ దీపాలు, దీపాలు, ఇతర పూజా సామాన్లపై ఏకంగా 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ఆయా వస్తువులు రూ. 100 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇక బ్రాండెడ్ వంట సామాగ్రి సెట్లు రూ. 499 నుంచి ప్రారంభమవుతాయి. మెన్, వుమెన్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్ మీద 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. మెన్ ఫార్మల్ షర్టులు రూ. 199 నుంచి, క్యాజువల్ షూలు రూ. 299 నుంచి ప్రారంభం అవుతున్నాయి. బ్రాండెడ్ లగేజ్ బ్యాగులు 50 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. సూట్ కేవలం రూ. 749కే అందిస్తోంది.
డిమార్ట్ లో కొనుగోలు చేసే వస్తువులకు బ్యాంక్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తే అదనపు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. HDFC, ICICI కార్డుల ద్వారా చెల్లిస్తే రూ. 500 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. డిమార్ట్ రెడీ యాప్ లో ఆర్డర్ చేసిన వస్తువులను ఉచిత డెలివరీ అందిస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. డిమార్ట్ దీపావళి అలంకరణ వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ కుటుంబంతో కలిసి డిమార్ట్ కు వెళ్లి.. తక్కువ ధరలో నచ్చిన వస్తువులను కొనుగోలు చేయండి.
Read Also: బజాజ్ ఫైనాన్స్ క్రేజీ ఆఫర్స్, దీపావళికి సగం ధరకే శామ్‌సంగ్ ప్రొడక్ట్స్!