Inverter backup time: కరెంట్ పోయినప్పుడు ఫ్యాన్ తిరగకపోతే లేదా చూస్తున్న సీరియల్ మధ్యలో టీవీ ఆగిపోతే ఎవరికైనా చిరాగ్గా ఉంటుంది కదా! అప్పుడే మనకు ఇన్వర్టర్ విలువ తెలుస్తుంది. అయితే.. “కరెంట్ పోతే ఇన్వర్టర్‌పై ఫ్యాన్ లేదా టీవీ ఎన్ని గంటలు నడుస్తుంది?” అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ, లోడ్, ఎఫిషియెన్సీ బట్టి బ్యాకప్ టైం మారుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్‌లో అయినా..వర్షాకాలంలో అయినా సడన్‌గా పవర్ కట్ అవ్వడం కామన్. ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే.. లైట్లు, ఫ్యాన్లు, టీవీ వెలుగుతూ ఉంటాయి. కానీ ఇన్వర్టర్ బ్యాటరీకి.. కూడా ఒక లిమిట్ ఉంటుంది.మనం దానిపై ఎంత లోడ్ వేస్తున్నామనే దాన్ని బట్టే అది ఎన్ని గంటలు నడుస్తుందో తెలుస్తుంది.
సాధారణంగా ఎక్కువ మంది 150Ah (12V) బ్యాటరీ ఉన్న ఇన్వర్టర్ ఎక్కువగా వాడుతుంటారు. ఈ బ్యాటరీలో.. నిల్వ ఉండే మొత్తం ఎనర్జీ సుమారు 1800 వాట్-గంటలు (150Ah × 12V) ఉంటుంది. అయితే.. ఇన్వర్టర్ లాసెస్, బ్యాటరీని పూర్తిగా.. డీప్ డిశ్చార్జ్ చేయకూడదనే.. నియమం వల్ల ఉపయోగపడే ఎనర్జీ సుమారు 70% నుంచి 80% (అంటే దాదాపు 1250Wh నుంచి 1440Wh) వరకు ఉంటుంది. పాత బ్యాటరీ అయితే..ఈ బ్యాకప్ ఇంకాస్త తగ్గుతుంది.
సాధారణ సీలింగ్ ఫ్యాన్ (సుమారు 70W–75W): 150Ah ఫుల్ చార్జ్‌డ్ బ్యాటరీపై ఒక్క ఫ్యాన్ మాత్రమే వేస్తే (సుమారు 80% యూజబుల్ ఎనర్జీ లెక్కన) దాదాపు 15 నుంచి 18 గంటల వరకు నడిచే అవకాశం ఉంటుంది.
BLDC ఫ్యాన్ (సుమారు 28W–35W): ఇవి తక్కువ పవర్ వాడతాయి కాబట్టి.. బ్యాకప్ ఇంకా ఎక్కువగా సుమారు 30 గంటలకు పైగానే వచ్చే ఛాన్స్ ఉంటుంది.
LED స్మార్ట్ టీవీ (32ఇంచులు /40 ఇంచులు సుమారు 50W–80W): టీవీ మాత్రమే.. నడిపితే బ్యాటరీ కండిషన్ బట్టి సుమారు 14 నుంచి 22 గంటల వరకు రావచ్చు.
ఫ్యాన్ + టీవీ కలిపి వాడితే.. ఉదాహరణకు ఫ్యాన్ (75W) + టీవీ (65W) కలిపి మొత్తం 140W లోడ్ పడితే.. బ్యాకప్ టైం సుమారు 8 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అదే సమయంలో.. లైట్లు, వైఫై రూటర్ కూడా ఉంటే సమయం ఇంకొంచెం తగ్గుతుంది.
మనం అనుకున్నంత సేపు ఇన్వర్టర్ బ్యాకప్ ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి.
బ్యాటరీ: బ్యాటరీ 2–3 ఏళ్లు దాటితే.. కెపాసిటీ తగ్గి బ్యాకప్ సగానికి పడిపోవచ్చు.
ఫుల్ చార్జ్ లేకపోవడం: కరెంట్ పోయే.. ముందు కొద్ది సేపే ఛార్జింగ్ అయితే.. బ్యాకప్ తక్కువగా వస్తుంది.
హై-ఓల్టేజ్ వస్తువులు: ఐరన్ బాక్స్, హీటర్, మిక్సీ, వాషింగ్ మెషీన్ వంటివి ఇన్వర్టర్‌పై అసలు వేయకూడదు. ఇవి లోడ్‌ను ఒక్క సారిగా పెంచి ఇన్వర్టర్ ట్రిప్ అవ్వడానికి కారణమవుతాయి.
ట్యూబ్లర్ vs లిథియం: కొత్త తరం లిథియం ఇన్వర్టర్లు వేగంగా ఛార్జ్ అవుతాయి. అంతే కాకుండా.. ఇవి బెస్ట్ బ్యాకప్ ఇస్తాయి. సాధారణ ట్యూబ్లర్ బ్యాటరీలలో ..డిస్టిల్డ్ వాటర్ లెవెల్ కూడా చెక్ చేస్తూ ఉండాలి.
Also Read: ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఈ పనులు అస్సలు చేయెద్దు! చిన్న పొరపాట్లతో జాబ్ పోతుంది
బ్యాకప్ పెరగాలంటే ఏం చేయాలి?
పవర్ కట్ సమయంలో.. ఎక్కువ సేపు బ్యాకప్ కావాలంటే.. స్మార్ట్‌గా వాడాలి. సాధారణ ఫ్యాన్ల స్థానంలో.. బీఎల్డీసీ ఫ్యాన్లు వాడటం, అవసరం లేని.. లైట్లు ఆఫ్ చేయడం, టీవీ బ్రైట్‌నెస్‌ను మరీ ఎక్కువగా కాకుండా.. నార్మల్‌గా ఉంచడం మంచిది.
మీ ఇన్వర్టర్ బ్యాటరీ కెపాసిటీ , దాని ప్రస్తుత కండిషన్, ఇంకా మీరు ఆన్ చేసిన డివైజ్‌ల మొత్తం.. వాటేజ్‌ను బట్టి బ్యాకప్ సమయం మారుతుంది. ఒక సారి మీ బ్యాటరీ ఎన్ని Ah ఉందో చూసి, ఈ సింపుల్ ఫార్ములాతో మీ ఇంటి బ్యాకప్ టైంను ఈజీగా అంచనా వేయొచ్చు!