Office laptop mistakes: ఒకప్పుడు ల్యాప్‌టాప్ అంటే జస్ట్ ఒక డివైస్, ఇప్పుడు చాలా పనులకు ఇది తప్పనిసరిగా మారింది! ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్స్, మెయిల్స్, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నింటికీ అవసరం. కానీ “అరేయ్, ఇదేం పెద్ద తప్పు కాదులే” అని మనం చేసే చిన్న చిన్న కేర్ లెస్ పనులు.. చివరికి కంపెనీకి, మన కెరీర్‌కి పెద్ద సమస్యగా మారతాయి. ప్రస్తుత రోజుల్లో.. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ విషయంలో.. ఆఫీసులు చాలా సీరియస్ ఉన్నాయి. అందుకే.. ఆఫీస్ ల్యాప్‌టాప్‌ని మన పర్సనల్ పాకెట్ లాగా వాడే ఆ చిన్న చిన్న బ్యాడ్ హాబిట్స్‌కి ఇప్పడే గుడ్‌బై చెప్పేయండి!
పర్సనల్ అకౌంట్స్ & బ్యాంకింగ్ లాగిన్‌లు: ఆఫీస్ బ్రౌజర్‌లో పర్సనల్ మెయిల్, సోషల్ మీడియా, నెట్ బ్యాంకింగ్, లేదా షాపింగ్ అకౌంట్లు లాగిన్ చేయడం మంచిది కాదు. పాస్‌వర్డ్‌లు సేవ్ అవ్వడం, కుకీలు మిగిలిపోవడం వల్ల మీ పర్సనల్ డేటాతో పాటు కంపెనీ నెట్‌వర్క్ కూడా రిస్క్‌లో పడుతుంది.
లింక్‌లు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్: తెలియని మెయిల్స్‌లోని లింక్‌లు క్లిక్ చేయడం, క్రాక్డ్ లేదా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేయడం వల్ల మాల్వేర్ లేదా వైరస్ వస్తుంది. ఆఫీస్ సిస్టమ్ ద్వారా కంపెనీ సర్వర్‌లోకి.. వైరస్ వెళితే అది సెక్యూరిటీ ఉల్లంఘనగా పరిగణిస్తారు.
కాన్ఫిడెన్షియల్ డేటా: క్లయింట్ లిస్ట్‌లు, సాలరీ/బిజినెస్ రిపోర్ట్స్, సోర్స్ కోడ్ లేదా ప్రాజెక్ట్ డేటాను పర్సనల్ పెన్‌డ్రైవ్, పర్సనల్ గూగుల్ డ్రైవ్ లేదా వాట్సాప్ వెబ్ ద్వారా షేర్ చేయడం చాలా ప్రమాదం. చాలా కంపెనీలలో ఇది నేరుగా పాలసీ ఉల్లంఘన కిందకు వస్తుంది.
అపరిచితులకు లేదా ఫ్యామిలీకి ఇవ్వడం: ఇంట్లో వర్క్ చేసేటప్పుడు.. పిల్లలు గేమ్స్ ఆడటానికి లేదా ఇంట్లో వాళ్లు బ్రౌజ్ చేయడానికి ఆఫీస్ ల్యాప్‌టాప్ ఇవ్వడం వల్ల అనుకోకుండా ఫైల్స్ డిలీట్ అవ్వడం లేదా అన్ సేఫ్ సైట్లు ఓపెన్ అవ్వడం జరగొచ్చు.
సెక్యూరిటీ రూల్స్ : VPN ఆఫ్ చేయడం, అడ్మిన్ యాక్సెస్ కోసం అనధికార మార్గాలు వాడటం, లేదా స్క్రీన్ లాక్ చేయకుండా.. అలానే వదిలేసి వెళ్లడం వంటివి కూడా రిస్కీ వ్యవహారాలే.
చాలామంది “IT టీమ్‌కు ఏం తెలుస్తుంది?” అనుకుంటారు. కానీ లేటెస్ట్ ఎంటర్‌ప్రైజ్ టూల్స్, యాక్టివిటీ లాగ్స్, డేటా లాస్ ప్రివెన్షన్ సిస్టమ్స్ ద్వారా మీరు ఏం చేస్తున్నా ఈజీ గుర్తిస్తారు. డేటా లీక్ జరిగినా, సెక్యూరిటీ బ్రీచ్ జరిగినా, లేదా కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా నడుచుకున్నా వార్నింగ్‌లు, PIP, లేదా నేరుగా టర్మినేషన్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెన్సిటివ్ డేటా విషయంలో కంపెనీలు ఎలాంటి రాజీ పడవు.
Also Read: చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి
స్మార్ట్‌గా సేఫ్‌గా ఎలా ఉండాలి?
1.వర్క్, పర్సనల్ వేరుగా ఉంచండి: పర్సనల్ పనుల కోసం మీ సొంత ఫోన్ లేదా పర్సనల్ ల్యాప్‌టాప్ మాత్రమే వాడండి.
2.కంపెనీ పాలసీలు ఫాలో అవ్వండి: ఆన్‌బోర్డింగ్ సమయంలో.. లేదా ఎప్పటి కప్పుడు వచ్చే ఐటీ, Infosec పాలసీలను ఒకసారి చదివి పాటించండి.
3. తప్పు జరిగితే వెంటనే చెప్పండి: పొరపాటున ఫిషింగ్ లింక్ క్లిక్ చేసినా, ఫైల్ మిస్ అయినా.. దాచకుండా వెంటనే ఐటీ హెల్ప్‌డెస్క్‌కు రిపోర్ట్ చేయండి. వెంటనే చెబితే డ్యామేజ్ కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది.
మొత్తానికి.. ఆఫీస్ ల్యాప్‌టాప్ అనేది మన మన బాధ్యతకు ప్రతీక. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బంది తెచ్చేకంటే.. ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం ఎప్పుడూ బెస్ట్.