Visio World 40 QLED: ఇంట్లో పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, ఓటీటీ సిరీస్‌లు చూసే.. ఫీలింగ్ వేరే లెవల్ కదా! కానీ ఇందుకోసం మంచి క్వాలిటీ ఉన్న స్మార్ట్ టీవీ కొనాలంటే ఎక్కువ డబ్బు అవసరం అవుతుందని చాలామంది వెనకాడతారు. సరిగ్గా ..అలాంటి బడ్జెట్ లవర్స్ కోసం రూ. 12,999 ధరలో.. 40 ఇంచుల (101 సెం.మీ)ఈ మోడల్ టీవీ మార్కెట్‌లో సందడి చేస్తోంది. తక్కువ ధరలోనే దీని క్యూఎల్ఈడీ లుక్, స్మార్ట్ ఫీచర్లు ప్రస్తుతం యూజర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టీవీలో 40 ఇంచుల ఫుల్ హెచ్డీ (1920×1080)క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సాధారణ బడ్జెట్ ఎల్ఈడీ టీవీలతో పోలిస్తే.. క్యూఎల్ఈడీ ప్యానెల్ వల్ల రంగులు కొంచెం బ్రైట్‌గా, వైబ్రెంట్‌గా కనిపిస్తాయి. HDR10 సపోర్ట్, సుమారు 350 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ వంటి అంశాలు రూమ్‌లో వేరే యాంగిల్ నుంచి కూర్చుని చూసినా పిక్చర్ మరీ డల్ అవ్వకుండా చూస్తాయి. అయితే.. ఇది 4K కాదు, ఫుల్ హెచ్డీ టీవీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్, డీటీహెచ్ కంటెంట్‌కు ఇది ఓకే అనిపిస్తుంది. కానీ హార్డ్‌కోర్ 4K లేదా 120Hz గేమింగ్ ఆశించే వారికి ఇది సరి పోదు.
పిక్చర్ ఎంత బాగున్నా.. సౌండ్ వీక్‌గా ఉంటే.. సినిమా మూడ్ చెడిపోతుంది. ఇందులో.. 24W స్పీకర్ అవుట్ పుట్ ఇచ్చారు. ఇది ఈ ధరలో ఉన్న చాలా బడ్జెట్ టీవీల కంటే.. కాస్త మెరుగైన అంశమే. చిన్న లేదా మీడియం రూమ్‌లలో సపరేట్ సౌండ్ బార్ లేకపోయినా డైలాగ్స్,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్పష్టంగా వినిపిస్తాయి.
స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీగా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్, జియో హాట్ స్టార్, జీ5 వంటి పాపులర్ యాప్స్ ఈజీగా వాడుకోవచ్చు. కనెక్టివిటీ కోసం.. HDMI, USB పోర్ట్‌లు, వై-ఫై, ఈథర్‌నెట్, స్క్రీన్ మిరరింగ్ ఆప్షన్లు కూడా దీనిలో ఉండటంతో సెట్-టాప్ బాక్స్ లేదా పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయడం ఈజీ. బడ్జెట్ ఆండ్రాయిడ్ టీవీలలో స్టోరేజ్, మెమరీ వంటివి కూడా ఉంటాయి కాబట్టి, రాబోయే ఏళ్లలో యాప్స్ ఎక్కువగా ఇన్‌స్టాల్ చేస్తే నెమ్మదించే అవకాశం ఉంటుంది. ఇది బడ్జెట్ టీవీలలో కామన్‌గా కనిపించే విషయమే.
రూ. 12,999 ధరలో పెద్ద 40 ఇంచుల స్క్రీన్,క్యూఎల్ఈడీ ఫీల్, 24W సౌండ్, 18 నెలల వారంటీ వంటివి కలిపి చూస్తే ఇది విలువైన బడ్జెట్ ఆప్షన్‌గానే కనిపిస్తోంది. మీ బడ్జెట్ రూ. 13,000 లోపే ఉంటే..పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. అంతే కాకుండా ఈ టీవీ ఫ్యామిలీ ఓటీటీ & టీవీ షోల కోసం.. డైలీ ఎంటర్‌టైన్‌మెంట్, యూట్యూబ్, సినిమాలు చూడటానికి బాగుంటుంది.
Also Read: మీ కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!
ఆఫర్లు: ఆన్‌లైన్ సేల్స్ సమయంలో ..ధరలు మారుతుంటాయి (కొన్నిసార్లు రూ. 11,999 వంటి ఆఫర్లు కూడా కనిపిస్తుంటాయి). కాబట్టి కొనే ముందు ఫైనల్ ప్రైస్, సర్వీస్ అవైలబిలిటీ చెక్ చేసుకోవడం మంచిది.
మొత్తానికి.. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఈ మోడల్ టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ ధరకే వెంటనే ఈ మోడల్ కొనేయండి.