E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Advertisement

Pawan Kalyan :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఒకవైపు హీరోగా అభిమానులను అలరిస్తూనే.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. నిత్యం సినిమాలు, రాజకీయాలు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇటీవల తన మూడవ భార్య అన్నా లెజినోవా కి కూడా విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే కట్టుకున్న భార్యలకు విడాకులు ఇచ్చినా.. పుట్టిన పిల్లలకు ఆయన ఏ రోజు ఏ లోటు చేయలేదు అనేది వాస్తవం.

ఆద్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

ఇకపోతే పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఏ విధంగా అయితే ఆరాధిస్తారో.. వారి భార్యలను, పిల్లల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు వీరి పిల్లలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే తెలిస్తే దానిని ఇట్టే వైరల్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆద్యకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే విషయంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ బయట పెట్టడంతో ఈ విషయాన్ని కాస్త తెగ వైరల్ చేస్తున్నారు.

అసలు విషయం బయటపెట్టిన రేణూ దేశాయ్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. 2000వ సంవత్సరంలో జేమ్స్ పాండు చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ తమిళంలో నటించలేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత ‘ఓం’ అనే చిత్రంతో తమిళంలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈమె.. అందులో భాగంగానే తాజాగా తన కూతురు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పి అందరిని సర్ప్రైజ్ చేసింది. ఇటీవల ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తల్లితోపాటు ఆద్య స్పెషల్ గెస్ట్ గా వచ్చి అందరిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని యాంకర్ ప్రస్తావిస్తూ మీ ఫ్యాషన్ వల్లే ఆధ్యా అంత పెద్ద ఈవెంట్లో దర్శనమిచ్చింది కదా.. అంటూ మాట్లాడుతుండగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. “మీరందరూ అనుకుంటున్నారు తాను నాకోసం రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కోసం వచ్చారు. అక్కడ ఎంతమంది స్టార్ కాస్ట్ ఉన్నా.. తనకు సంబంధం లేదు. తాను కేవలం సాయి కోసమే వచ్చింది. కానీ ఆయన ఏదో రికార్డింగ్ పనుల వల్ల ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయారు.. ఆద్య చాలా అప్సెట్ అయ్యింది ” అంటూ రేణూ దేశాయ్ తెలిపింది.

also read: అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

సోషల్ మీడియాకి దూరంగా..

Advertisement

తన కూతురికి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యకి సాయి అభ్యంగర్ అంటే ఇష్టమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆద్య విషయాన్నికి వస్తే.. ఈమె సాధారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు మాత్రం ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించి సందడి చేశారు. అయితే రేణూ దేశాయ్ మాత్రం సాధ్యమైనంతవరకు తన పిల్లలకు , కుటుంబ బంధాల విలువలను నేర్పుతూ వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత నిస్తూ ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలోనే తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను రేణూ దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

Related News

అల్లు అరవింద్ చేతుల్లోకి వైజయంతి మూవీస్.. అశ్వినీ దత్ క్లారిటీ!

నా డ్రీమ్ రోల్ అదే: రేణూ దేశాయ్

Sobhita Dhulipalla: అక్కినేని కోడలు రేంజే వేరు.. ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

బురదలో ఫైట్.. నీళ్లలో 20 గంటలు.. రష్మిక కష్టాలు మామూలుగా లేవుగా!

అప్పుడు దేశముదురు.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తున్న శర్వా ‘భోగి’.. కొత్త డేట్ ఫిక్స్!

Big Stories

Advertisement
×