E-Paper
Advertisement

మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!

మిడ్‌రేంజ్ మార్కెట్లో మోటరోలా సంచలనం.. 53 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న Edge 70 Neo!
Advertisement

Motorola Edge 70 Neo: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే.. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టే తలనొప్పి లేకుండా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం రెండు రోజులు నిశ్చింతగా వాడుకునే బ్యాటరీ ఉండాలని. ప్రస్తుతం ఇలాంటి యూజర్ల అవసరాన్ని గుర్తించిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా.. ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీతో Motorola Edge 70 Neo ఫోన్‌ను భారతదేశంలోకి తీసుకొస్తోంది. నవంబర్ 24న ఈ హ్యాండ‌సెట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

లాంచ్ ఎప్పుడంటే?

ఈ Motorola Edge 70 Neo ఈనెల 24న భారత్‌లో లాంచ్ కానుంది. విడుదలైన తర్వాత కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌ను 4 రంగుల్లో తీసుకొస్తున్నారు. పాంటోన్ మౌంటెన్ వ్యూ, మిల్కీ బ్లూ, గ్రే లిలాక్, సేజ్ రంగులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రంగుకు భిన్నమైన ఫినిషింగ్ ఇచ్చారు. ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అంచనాల ప్రకారం ఇది రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ధర కోసం లాంచ్ వరకు వేచి చూడాలి.

డిస్‌ప్లే, పనితీరు..

Advertisement

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో పాటు 8GB LPDDR5X ర్యామ్ ఉంటుంది. అవసరాన్ని బట్టి AI ర్యామ్ బూస్ట్ కూడా ఉపయోగపడుతుంది. వేడి తగ్గించేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16తో వచ్చే ఈ ఫోన్‌కు మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని మోటరోలా తెలిపింది.

Also Read: ఫోల్డబుల్ ఫోన్ కంటే దీనికే క్రేజ్ ఎక్కువ.. 2027లో యాపిల్ వదలబోతున్న బ్రహ్మాస్త్రం ఇదే!

కెమెరా ఫీచర్లు..

Advertisement

వెనుకవైపు OIS ఉన్న 50MP సోనీ లిటియా 710 ప్రధాన కెమెరా ఉంది. తక్కువ వెలుతురులో ఫొటోలు తీసేందుకు నైట్ విజన్ ఫీచర్, నాయిస్ తగ్గించే సదుపాయం, ఏఐ ఇమేజ్ మెరుగుదల వంటి టూల్స్ ఉన్నాయి. అడాప్టివ్ స్టెబిలైజేషన్, 10x సూపర్ జూమ్ కూడా అందిస్తున్నారు. గూగుల్ ఫొటోస్‌లోని ఆస్క్, ఎడిట్ ఫీచర్లతో ఫొటోలు వెతకడం, ఎడిట్ చేయడం సులభం కానుంది. దుస్తులు, అవుట్‌ఫిట్లను సర్దుకోవడానికి కూడా ఏఐ సదుపాయాలు ఉన్నాయి.

బ్యాటరీ, ఇతర వివరాలు..

7,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వాడొచ్చని, గరిష్ఠంగా 53 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఆడియో, IP64 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు 204 గ్రాములు, మందం 8.49 మిల్లీమీటర్లు. ఈ ఫీచర్లతో పాటు దీని తుది ధరే పోటీ ఫోన్ల మధ్య స్థానం నిర్ణయించనుంది. పెద్ద బ్యాటరీ, వేగమైన స్క్రీన్ ఉన్న ఇతర మోడళ్లతో పోలిస్తే ధర అందుబాటులో ఉంటే కొనుగోలుదారుల ఆసక్తి పెరగొచ్చు.

Also Read: ఎయిర్‌టెల్ యూజర్లకు జాక్‌పాట్.. ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Tags

Related News

ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఈ పనులు అస్సలు చేయెద్దు! చిన్న పొరపాట్లతో జాబ్ పోతుంది

90s కిడ్స్ ఫేవరెట్.. మార్కెట్లోకి నోకియా 1100 రీ-ఎంట్రీ.. ఇక బ్యాక్ టూ గోల్డెన్ డేస్ మామ!

ఫోల్డబుల్ ఫోన్ కంటే దీనికే క్రేజ్ ఎక్కువ.. 2027లో యాపిల్ వదలబోతున్న బ్రహ్మాస్త్రం ఇదే!

ఎయిర్‌టెల్ యూజర్లకు జాక్‌పాట్.. ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

సగం ధరకే..40 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ పోతే మళ్లీ రాదు బాస్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదెక్కడి మాస్ అప్డేట్ భయ్యా.. స్టోరీ పెట్టాక కూడా మ్యూజిక్, టెక్స్ట్ మార్చుకోవచ్చు!

వైఫై 6 Vs వైఫై 7..స్మార్ట్ హోమ్, గేమింగ్‌కు ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×