BigTV English

Youtube Channel Tips: 2025లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా? ఇలా చేస్తేనే మీరు సక్సెస్!

Youtube Channel Tips: 2025లో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారా? ఇలా చేస్తేనే మీరు సక్సెస్!

Youtube Channel: యూట్యూబ్ ఛానెల్ ద్వారా చాలా మంది బాగా పాపులర్ అవుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ ను అందిస్తూ చక్కటి ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు. అదే సమయంలో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? అనే పూర్తి విషయాల ఇప్పుడు పరిశీలిద్దాం..


యూట్యూబ్ ఛానెల్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి?  

⦿ దైర్యంగా ముందడుగు వేయండి


కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించేవాళ్లు ఎదుటి వారు ఏం అనుకుంటారో అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించకూడదు. నిరాశ కలిగించే మాటలు విని ఆగిపోకూడదు. ఎగతాళి, విమర్శలను అస్సలు పట్టించుకోకూడదు. మొదట్లో మీ వీడియోలకు వ్యూస్ వచ్చినా.. రాకున్నా.. పట్టించుకోకుండా ముందుకుసాగండి.

⦿ స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్లండి

మీరు యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించినప్పుడే కచ్చితంగా సక్సెస్ కావాలనే లక్ష్యంతో పని చేయాలి. పోటీ ప్రపంచానికి దీటుగా మీ వీడియోలను రూపొందించండి. మీరు ఎంచుకున్న రంగం ఏదైనా, ఆకట్టుకనే కంటెంట్ ను రూపొందించే ప్రయత్నం చేయండి.

⦿ మీ ఉద్యోగాన్ని వదలకండి

మీరు యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించగానే ఇతర పనులను వదులుకోకూడదు. మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేయండి. యూట్యూబ్ ఛానెల్ బాగా సక్సెస్ అయిన తర్వాత.. ఉద్యోగం అడ్డంకిగా మారితే అప్పుడు మాత్రమే జాబ్ ను వదులుకోవాలి. ముందుగా యూట్యూబ్ ను బాగా అభివృద్ధి చేసుకోవాలి.

⦿ మార్కెట్ రీసెర్చ్ చాలా ముఖ్యం

మీరు కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించండి. తాజాగా అల్గారిథం గురించి తెలుసుకోండి. క్లిక్స్ పెంచేందుకు చక్కటి కంటెంట్ తో పాటు థంబ్ నెయిల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకోండి. వ్యూవర్స్ ను ఆకట్టుకునేలా మీ వీడియోలను రూపొందించండి. ప్రతి వీడియోను క్రియేటివ్ గా రూపొందించండి.

⦿ వీడియో కంటే ఆడియో ముఖ్యం

వీడియోలు చాలా క్వాలిటీగా ఉండాలని చాలా మంది ఖరీదైన కెమెరాలు కొనుగోలు చేస్తారు. కానీ, వీడియో కంటే మీరు చెప్పే విషయం చాలా ముఖ్యం అని గమనించాలి. మీరు ఖరీదైన వస్తువులను కాకుండా చక్కటి కంటెట్ మీదే ఫోకస్ పెట్టండి.

⦿ ఆకట్టుకునే విషయాలు చెప్పండి

మీరు వీడియోలో వ్యూవర్స్ విలీనం అయ్యేలా చూసుకోవాలి. మీరు చెప్పే విషయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా స్టోరీ చెప్పాలి. మీరు తీసుకునే పాయింట్ కొత్తగా ఉండేలా చూసుకోవాలి. చెప్పే విధానం సరదాగా, కథలో కూడి ఉండటం మంచిది. అలాంటి వీడియోలకు వ్యూవర్స్ కనెక్ట్ అవుతారు.

⦿ స్లో డెవలప్మెంట్

యూట్యూబ్ ఛానెల్ ఒకేసారి పాపులర్ కావాలని భావించకూడదు. నెమ్మదిగా వృద్ధిసాధించేలా జాగ్రత్త పడండి. థంబ్‌ నెయిల్, లైటింగ్, ఎడిటింగ్, మీరు విషయాన్ని చెప్పే విధానం వీడియోకు వీడియోకు కాస్త మెరుగయ్యేలా చూసుకోండి.

⦿ ఆల్గారిథమ్, ప్రేక్షకుల ఆలోచన  

వీడియోలు పాపులర్ కావాలంటే యూట్యూబ్ అల్గారిథమ్ ను ఫాలో కావడంతో పాటు ప్రేక్షకుల ఆలోచలనకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ను కోరుకుంటున్నారో అలాంటి కంటెంట్ ను ఎక్కువగా అందించే ప్రయత్నం చేయాలి. అదీ యూట్యూబ్ అల్గారిథమ్ కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

⦿ ఆకట్టుకునే మ్యూజిక్ యాడ్ చేయండి

యూట్యూబ్ వీడియో ఆట్టుకోవాలంటే దానికి మీరు యాడ్ చేసే మ్యూజిక్ కీలకపాత్ర వహిస్తుంది. మీ వీడియోకు అనుగుణంగా ఉండే మ్యూజిక్ ను జోడించడం వల్ల మంచి వ్యూస్ సాధించే అవకాశం ఉంటుంది.

⦿ ఓపికతో విజయం  

మీరు యూట్యూబ్ వీడియోలను చక్కగా క్రియేట్ చేస్తున్నప్పటికీ, వెంటనే గుర్తింపు రాదని గుర్తుంచుకోవాలి. మీ చానెల్ బాగా పాపులర్ కావడానికి కొంత సమయం పడుతుందని గుర్తించాలి. మీరు ఓపికతో ప్రయత్నం చేస్తూ ఉండండి విజయం సాధ్యం అవుతుంది.

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారా? సింఫుల్ గా ఈ స్టెప్స్ ఫాలోకండి!

Tags

Related News

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Big Stories

×