Smartphones Screen Mirroring: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీల్లో బోలెడు లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వైఫై సౌకర్యం ఉంటే స్మార్ట్ ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేసి హాయిగా పెద్ద స్క్రీన్ మీద సినిమాలతో పాటు న్యూస్, స్పోర్ట్స్, సీరియల్స్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్లలో టీవీని కనెక్ట్ చేసుకునే మిర్రర్ స్క్రీన్ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకుని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ స్మార్ట్ ఫోన్ ను టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
స్మార్ట్ ఫోన్ ను టీవీకి ఎలా కనెక్ట్ చేయాలి?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్ ను కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ టీవీకి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిర్రర్ స్క్రీన్ ఫీచర్ సాయంతో ఫోన్ ను స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చెయ్యొచ్చు. ఇంతకీ, స్మార్ట్ ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేయడానికి ఫాలో కావాల్సిన స్టెప్స్ ఇవే!
⦿ ముందుగా మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయాలి.
⦿ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీది నుంచి కిందికి, మరికొన్ని ఫోన్లలో కింది నుంచి మీదికి ట్యాప్ చేయాలి.
⦿ ఇందులో పలు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో స్మార్ట్ వ్యూ లేదంటే మిర్రర్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలు డిస్ ప్లే అవుతాయి.
⦿ వాటిలో మీరు కనెక్ట్ చేయాలి అనుకుంటున్న స్మార్ట్ ఫోన్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఇలా చేస్తే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ టీవీకి వెంటనే కనెక్ట్ అవుతుంది.
⦿ అదే సమయంలో మీ స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేయడానికి టీవీ మీ అనుమతి అడుగుతుంది.
⦿ అప్పుడు రిమోట్ ద్వారా అనుమతించాల్సి ఉంటుంది.
⦿ వెంటనే మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టీవీకి కనెక్ట్ అవుతుంది. మీ మోబైల్ స్క్రీన్.. టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
⦿ మీ ఫోన్ లోని యాక్టివిటీ అంతా టీవీ స్క్రీన్ మీద చూసుకునే అవకాశం ఉంటుంది.
⦿ మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సినిమాలు, వీడియోతో పాటు ఫోటోలను చూసుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ లోని పలు యాప్స్ ద్వారా ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ ను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
USB కేబుల్స్, క్రోమ్ కాస్ట్ డివైజ్ సహా పలు పద్దతుల ద్వారా కూడా స్మార్ట్ ఫోన్ ను టీవీతో కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, అదంతా కాస్త కిష్టతరమైన ప్రక్రియ. అందుకే సింపుల్ గా మిర్రర్ స్క్రీన్ ఆప్షన్ ద్వారా స్మార్ట్ ఫోన్ ను టీవీకి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: మీ ఫోన్ ఆన్ కావట్లేదా? నో టెన్షన్.. సింఫుల్ గా ఇలా చేయండి!