BigTV English

Pushpa 2 Collections : ‘బాహుబలి 2’ కాదు… భారీ డిజాస్టర్… తలలు పట్టుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్

Pushpa 2 Collections : ‘బాహుబలి 2’ కాదు… భారీ డిజాస్టర్… తలలు పట్టుకుంటున్న డిస్ట్రిబ్యూటర్స్

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) కలెక్షన్ల పరంగా రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ మూవీ ఓ భాషలో మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా, భారీ నష్టాలను తెచ్చి పెట్టిందని తెలుస్తోంది.


టాప్ లేపేసిన కలెక్షన్స్…

‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కడ చూసినా ఈ మూవీ మేనియా గట్టిగానే నడిచింది. దానికి తగ్గట్టుగానే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీకి హిందీలో ప్రేక్షకులు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయారు. దీంతో తెలుగు కంటే ఎక్కువగా హిందీలోనే మంచి కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్ అయిన 30 రోజుల్లోనే ఈ సినిమా ‘బాహుబలి 2’ లైఫ్ టైం కలెక్షన్లను దాటేసి, ఏకంగా రూ. 1831 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. నార్త్ లో ‘పుష్పట 2’ హడావిడి ఇంకా నడుస్తోంది.


ఇక్కడ మాత్రం కష్టమే…

ఇక మిగతా భాషల్లో మాత్రం ఈ సినిమాకు సంబంధించి భారీ నష్టాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మూవీ రిలీజ్ అయిన మొదట్లోనే కేరళలో స్లో అయింది. మొదటి వారం తర్వాత కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో కూడా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఆగిపోయాయి. తెలుగులో అయితే ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటలేదని అంటున్నారు. ఓవర్సీస్ లోనూ 18 మిలియన్ల మార్క్ ను క్రాస్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ఇప్పటిదాకా ఆ ఫీట్ ను అందుకోలేకపోవడం గమనార్హం. ఒక్క హిందీలో మాత్రం ఏకంగా 800 కోట్లకు పైగా నెట్ సాధించి, పుష్పరాజ్ అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఇక తాజాగా తమిళంలో ఈ సినిమా రన్ టైం పూర్తి కాగా, క్లోసింగ్ కలెక్షన్స్ చూస్తే భారీ నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 110 కోట్లకు అమ్మారట మేకర్స్. కానీ 70 కోట్ల దగ్గరే ఈ మూవీ కలెక్షన్స్ ఆగిపోయాయని సమాచారం. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ‘పుష్ప 2’ మూవీకి తమిళంలో ఏకంగా 40 కోట్ల భారీ నష్టం వచ్చినట్టు. ఈ వార్తలో ఎంత వరకు నిజముంది అనేది తెలియదు. కానీ ఏకంగా 40 కోట్ల నష్టమంటే మామూలు విషయం కాదు. ఈ భారీ నష్టాలు చూసి డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారట. మరి ‘బాహుబలి’ కలెక్షన్లను బీట్ చేయగలిగిన ఈ సినిమా అక్కడ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోవడం ఏంటో అంటూ మళ్లీ పుష్ప రాజ్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. నిజానికి తమిళ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. కానీ తెలుగు సినిమాలకు మాత్రం తమిళంలో ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రాదు అనడానికి ఇదే నిదర్శనం. మరి తెలుగులో క్లోసింగ్ కలెక్షన్స్ చూస్తేనే గానీ నష్టాలు, లాభాలపై ఒక అంచనాకు రాలేము.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×