Congress- BJP: హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తల పరస్పర వ్యతిరేక నినాదులు, తోపులాటలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీపై.. బీజేపీ కీలక నేత రమేష్ బిదూరి అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన నేపథ్యంలో ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బీజేపీ ఆఫీస్ ను చుట్టుముట్టాయి.
బీజేపీ – కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదలతో నాంపల్లిలోని బీజేపీ కార్యలయం పరిసరాలు కొద్దిసేపట్లోనే ఉద్రిక్తంగా మారగ.. క్రమంగా పరిస్థితులు మరింత దిగజారాయి. బీజేపీ కీలక నేత రమేష్ బిదూరీ క్షమాపణలు చెప్పాలని, మహిళ అని కూడా చూడకుండా అలాంటి వ్యాఖ్యాలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదుల చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగగా.. కోడిగుడ్లు, రాళ్లతో దాడులకు దిగారు. క్రమంగా గొడవ పెద్దది కావడంతో.. రాళ్లు సైతం విసురుకోగా కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆగ్రహావేశాలకు గురైన కొందరు ఇరు పార్టీల కార్యకర్తలు.. కర్రలతో దాడులకు దిగారు.
Also Read: కేటీఆర్‌పై మండిపడ్డ వెంకట్, విదేశాలకు పారిపోయే ఛాన్స్
ఇరు పార్టీల కార్యకర్తల దాడుల్లో ఓ బీజేపీ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశాయి. బిదూరీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశాయి. దీంతో కోపోద్రేకులైన కాషాయ శ్రేణులు.. దాడులకు ఎగబడ్డారు. కాంగ్రెస్ దాడిని బీజేపీ నేతలు ఖండించారు. దాడిని హేయమైన చర్యగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.