OTTMovie : బ్లాక్ మ్యాజిక్, దెయ్యాలు, భయంకరమైన సంఘటనలతో నడిచే ఒక థాయ్ హారర్ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా ప్రధానంగా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ఉన్న ఒక శాపంతో, తన పక్కన ఉన్నవాళ్ళు దారుణంగా చనిపోతుంటారు. చేతబడి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఆడియన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘పానర్’ (Panor) 2025లో విడుదలైన థాయ్ హారర్ థ్రిల్లర్ సినిమా. పుట్టిపాంగ్ సైసికావ్ దర్శకత్వంలో, పానర్ (చెర్‌ప్రాంగ్ ఆరీకుల్), పియాక్ (జాక్రిన్ కుంగ్వాన్‌కియాటిచై), న్యూయల్ (చలితా సువాన్సానే), జిబ్ (మిమ్ రత్తవదీ వాంగ్‌తాంగ్) ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా 2025 జనవరి 16న థాయ్‌ల్యాండ్‌లో విడుదలైంది. ఈ సినిమా ‘ముబి’ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పానర్ అనే అమ్మాయి థాయ్ ల్యాండ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మిస్తుంది. ఆమె పుట్టిన రోజు ఒక పురాతన బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్ జరిగి గ్రామంలో భయంకరమైన దెయ్యాలు వస్తాయి. దీంతో ఆ గ్రామస్తులు బాగా భయపడిపోతారు. అప్పట్నుంచి గ్రామస్తులు పానర్‌ను దూరం పెడుతుంటారు. ఆమెతో ఉంటే చెడు జరుగుతుందని భయపడతారు. ఆమెకు ఫ్రెండ్స్ ఉండరు, కనీసం కుటుంబం కూడా ఆమెను సపోర్ట్ చేయదు. ఇక పానర్ పెరిగే కొద్దీ, ఆమె చుట్టూ ఉన్నవారు భయంకరమైన యాక్సిడెంట్స్‌లో చనిపోతుంటారు. ఆమె దగ్గర ఉన్నవారికి దెయ్యం లాంటి షాడోస్ కనిపించి, బ్లడీ ఇంజూరీస్ అవుతాయి.
దీంతో పానర్ తన బర్త్ సీక్రెట్ తెలుసుకోవాలని డిసైడ్ చేస్తుంది. ఆమె తల్లి న్యూయల్ కొన్ని క్లూస్ ఇస్తుంది. కానీ ఆమె కూడా భయపడుతుంది. పానర్ తన గ్రామంలోని పురాతన బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకోవడం మొదలుపెడుతుంది. ఆమెకు పియాక్, జిబ్ అనే ఒక స్నేహితులు సహాయం చేస్తారు. వాళ్లు గ్రామంలోని పాత రిచ్యువల్ స్పాట్స్, ఆలయాలు చెక్ చేస్తారు. అక్కడ వాళ్లకు భయంకరమైన దెయ్యం లాంటి ఫిగర్స్, విచిత్రమైన సౌండ్స్ ఎదురవుతాయి. ఆ రిచ్యువల్ ఒక బ్లాక్ మ్యాజిక్ గురువుతో కనెక్ట్ అయి ఉంటుంది. అతను ఈ గ్రామాన్ని ఒక శాపంలో బంధించాడు. పానర్ జన్మ కూడా ఈ కర్స్‌లో భాగమని తెలుస్తుంది. ఆమె స్నేహితులు పియాక్, జిబ్ ఈ ఇన్వెస్టిగేషన్‌లో డేంజర్‌లో పడతారు. ఇక పానర్ తన తల్లి న్యూయల్‌తో కలిసి ఈ కర్స్‌ను బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె గ్రామంలోని కొందరు సీక్రెట్ గా అడ్డుకుంటూ ఉంటారు.
క్లైమాక్స్‌లో పానర్ బ్లాక్ మ్యాజిక్ గురువు ఎవరో కనుక్కుంటుంది. అతను గ్రామంలో ఉండి, సీక్రెట్ గా ఈ శపాన్ని కంటిన్యూ చేస్తుంటాడు. పానర్, పియాక్, న్యూయల్ కలిసి ఒక పెద్ద సూపర్ నాచురల్ ఫైట్‌లో ఎంటర్ అవుతారు. ఈ ఫైట్‌లో భయంకరమైన రిచ్యువల్ స్పెల్స్ ఉంటాయి. పానర్ తన బర్త్ సీక్రెట్‌ను పూర్తిగా తెలుసుకుంటుంది. కర్స్‌ను బ్రేక్ చేయడానికి సంకల్పంతో పోరాడుతుంది. చివరికి పానర్ బ్లాక్ మ్యాజిక్ గురువును ఓడిస్తుందా ? అతడు పెంచి పోషించిన శాపాన్ని బ్రేక్ చేస్తుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా