BigTV English

OTT Movie: అయ్యయ్యో ఈ లవ్ స్టోరీ మామూలుగా లేదే… ఎంట్రీనే ఊర మాస్… క్లైమాక్స్ ఊహించలేం

OTT Movie: అయ్యయ్యో ఈ లవ్ స్టోరీ మామూలుగా లేదే… ఎంట్రీనే ఊర మాస్… క్లైమాక్స్ ఊహించలేం

OTT Movie : జీవితాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. అయితే కాలం ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా, అందరికీ ఇవాల్సింది ఇచ్చే వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల అబ్యూస్ తో మొదలై, పెద్దయ్యాక వాళ్ళు ఎలా మారుతారో కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. దీంతో పాటు ఒక ఎమోషనల్‌గా సాగే ప్రేమ కథ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కొరియన్ సినిమా క్లైమాక్స్ మాత్రం కంట తడి పెట్టిస్తుంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో

‘బ్రీత్ లెస్’ 2008లో వచ్చిన సౌత్ కొరియన్ సినిమా. దీనికి ఇక్-జూన్ దర్శకత్వం వహించారు. మెయిన్ క్యారెక్టర్స్‌లో ఇక్-జూన్ (సాంగ్-హూన్ ). యోన్-హీ (కిమ్ క్కోబ్బీ), హ్యూన్-సూ (కొంగ్ లీ) ఉన్నారు. 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. 2008లో పూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2009లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. 2009లో గ్రాండ్ బెల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ (ఇక్-జూన్) గెలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

సాంగ్-హూన్ ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి, తిరిగి వసూలు చేసే ఒక గుండా. ఎవరైనా డబ్బు తిరిగి ఇవ్వకపోతే కొడతాడు, బెదిరిస్తాడు. అతని లైఫ్ చిన్నప్పటి నుంచి దారుణంగా ఉంటుంది. తండ్రి ఒక శాడిస్ట్ కావడంతో, అతనితో పాటు అమ్మని, అక్కని బాగా కొట్టేవాడు. ఈ కొట్టుకోవడం వల్ల అతని అమ్మ, అక్క చనిపోతారు. ఇప్పుడు సాంగ్-హూన్ తన తండ్రిని తిరిగి కలిసి, కొట్టి పగ తీర్చుకుంటాడు. అతని లైఫ్‌లో కేవలం కోపం, గుండాగిరి, ఒంటరితనం మాత్రమే మిగిలి ఉంటాయి. అతనికి ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఎందుకంటే అతడు ఎవరినీ నమ్మడు. ఈ సమయంలో ఒక రోజు అతను యోన్-హీ అనే స్కూల్ పిల్లని కలుస్తాడు. యోన్-హీకి కూడా లైఫ్ లో చాలా కష్టాలు ఫేస్ చేస్తుంది. ఆమె తండ్రి కూడా అబ్యూసివ్, ఆమె స్కూల్‌లో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ, డ్రగ్స్ యూజ్ చేస్తుంది. ఒక చిన్న కారణంతో సాంగ్-హూన్ ఆమెను కొట్టబోతాడు, కానీ ఆమె అతనితో గట్టిగా ఫైట్ చేస్తుంది. ఇది వాళ్ల మధ్య ఒక విచిత్రమైన ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తుంది.


సాంగ్-హూన్, యోన్-హీ కలిసి ఇప్పుడు సమయం గడుపుతారు. వాళ్లు సిగరెట్ షేర్ చేసుకోవడం, స్ట్రీట్స్‌లో తిరగడం, చిన్న చిన్న జోక్స్ వేసుకోవడం చేస్తారు. ఈ ఫ్రెండ్‌షిప్ సాంగ్-హూన్‌ని కొంచెం మారుస్తుంది. అతను యోన్-హీ గురించి కేర్ తీసుకోవడం మొదలుపెడతాడు. యోన్-హీ తన ఇంట్లో తండ్రి కొట్టడం, స్కూల్‌లో బెదిరింపులు గురించి అతనికి చెబుతుంది. సాంగ్-హూన్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే అతనూ అలాంటి బాధలు అనుభవించాడు. కానీ అతని లైఫ్ ఇంకా డార్క్‌గానే ఉంటుంది. అతను అప్పు తీసుకున్న క్లయింట్స్‌ను బాగా కొడుతుంటాడు. సాంగ్-హూన్ తన తండ్రితో కూడా ఫైట్స్ చేస్తాడు. అయినా కూడా అతని కోపం ఇంకా ఆగదు. యోన్-హీ తన డ్రగ్ అడిక్షన్, తండ్రి అబ్యూస్‌తో ఇబ్బంది పడుతుంది. అయితే వీళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎమోషనల్‌గా బలంగా అవుతుంది. కానీ వాళ్ల లైఫ్ ఇంకా డేంజర్‌లోనే ఉంటుంది.

కథ నడిచే కొద్దీ సాంగ్-హూన్, యోన్-హీ లైఫ్ మరింత గందరగోళంగా మారుతుంది. సాంగ్-హూన్ ఒక మిస్టేక్ చేయడంతో, అతను మాఫియాతో ట్రబుల్‌ లో పడతాడు. క్లైమాక్స్ లో సాంగ్-హూన్ తన కోపం, గుండాగిరి లైఫ్ నుంచి బయటపడాలని, యోన్-హీకి మంచి లైఫ్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. కానీ ఫైనల్‌గా, వాళ్ల జీవితం ఒక హార్ట్‌బ్రేకింగ్‌ ట్విస్ట్ తో ట్రాజిక్‌గా ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? సాంగ్-హూన్ మాఫియా నుంచి బయట పడతాడా ? యోన్-హీకి లైఫ్ ఇస్తాడా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Related News

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

OTTMovie: బ్లాక్ మ్యాజిక్ తో దద్దరిల్లిన బాక్స్ ఆఫీస్… దేవుడనుకుని దెయ్యానికి పూజలు… ట్రైలర్ కే ప్యాంట్ తడిపించే సినిమా

OTT Movie : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

Mirai On OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిరాయ్.. అధికారిక ప్రకటన!

Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!

OTT Movie : ఈ నలుగురు కుర్రాళ్ళు అరాచకం భయ్యా… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా భయ్యా ?

Big Stories

×