తక్కువ ఖర్చుతో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది IRCTC. ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా పర్యాటకులు ఈ యాత్రలకు వెళ్లే సౌకర్యం కల్పిస్తుంది. తాజాగా IRCTC పర్యాటకుల కోసం మేఘాలయ టూర్ ప్యాకేజీ పరిచయం చేసింది. ‘మ్యాజికల్ మేఘాలయ’ అనే పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
తాజాగా తీసుకొచ్చిన ‘మ్యాజికల్ మేఘాలయ’ టూర్ ప్యాకేజీ ఏడు రోజుల పాటు కొనసాగనున్నట్లు IRCTC అధికారులు వెల్లడించారు. వసతి, భోజనం ఉచితంగా అందించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పర్యాటకులు గౌహతి, షిల్లాంగ్, చిరపుంజిని చూసే అవకాశం కల్పిస్తారు. ఈ టూర్ విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 44,205గా IRCTC నిర్ణయించింది. ఇక IRCTC తరచుగా పర్యాటకుల కోసం దేశీయ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలు పర్యాటకాన్ని ప్రోత్సహించడమే భాగంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. సరసమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇప్పుడు, IRCTC పర్యాటకుల కోసం మేఘాలయ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.
ఇక IRCTC మ్యాజికల్ మేఘాలయ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 12న ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీని IRCTC “దేఖో అప్నా దేశ్” ప్రచారం కింద అందిస్తోంది. టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 రోజుల పాటు కొనసాగనుంది. పర్యాటకులు టూర్ ప్యాకేజీలో విమానంలో ప్రయాణిస్తారు. పర్యాటకులంతా కంఫర్ట్ క్లాస్ లో ప్రయాణిస్తారు.
Read Also: ఇండియాలో స్పెషల్ రైలు, ఇందులో టికెట్ లేకుండా ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు!
ఇక ‘మ్యాజికల్ మేఘాలయ’ టూర్ ప్యాకేజీల ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఒంటరిగా ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ. 63,635 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ.46,085 చెల్లించాలి. ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తే, ఒక్కొక్కరికి రూ. 44,205 చెల్లించాలి. బెడ్ తో కూడిన పిల్లల టూర్ ప్యాకేజీకి ఛార్జీ రూ.38,965 చెల్లించాల్సి ఉంటుంది. బెడ్ లేని పిల్లల టూర్ ప్యాకేజీకి ఛార్జీ రూ. 28,535. పర్యాటకులు IRCTC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే టూర్ టికెట్ బుక్ చేసుకోండి. వారం రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
Read Also: ఈ 5 చిట్కాలు పాటిస్తే.. సెకన్లలో వ్యవధిలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!