BigTV English

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

AI Bike Garuda: దేశంలో టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది ప్రముఖులు చెబుతున్నమాట. కాకపోతే ప్రొత్సహంచేవారు తక్కువ. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు విదేశాలకు వలస పోతుంటారు. తాజాగా ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ‘ఏఐ బైక్’ని రూపొందించారు. యువకుల ఈ బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఖర్చు ఎంతో తెలుసా? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్దాం.


ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు శివమ్ మౌర్య-గురుప్రీత్ అరోరా-గణేశ్ పాటిల్ ‘గరుడ’ పేరుతో ట్రెండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ఆధారిత బైక్‌ను రూపొందించారు. ఆ బైక్‌ని 50 శాతం వ్యర్థాలు, మిగిలిన 50 శాతం కస్టమ్-మేడ్ భాగాలతో తయారు చేశారు. ఇందుకోసం వారు పెట్టిన ఖర్చు కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ.

గరుడ బైక్‌లో భద్రతకు అత్యంత ప్రయార్టీ ఇచ్చారు. అందులో ఉన్న రెండు హై-రేంజ్ సెన్సార్లు రియల్‌టైమ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తాయి. వాహనానికి 12 అడుగుల పరిధికి రాగానే బైక్ నెమ్మదిస్తుంది. ఏదైనా అడ్డు వచ్చిందంటే మూడు అడుగుల దూరంలో బ్రేకులు వేయకుండానే వాయిస్ కమాండ్ ద్వారా ఆగిపోతుంది.


ఏఐ ఆధారితంగా వచ్చిన ఈ బైక్ రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని చెబుతున్నారు విద్యార్థులు. ఇక ఫీచర్స్ విషయానికొద్దాం.  ఈ బైక్‌లో టచ్‌ స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ఉంది. దీనిద్వారా జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ముందు, వెనుక అమర్చిన కెమెరాల ద్వారా తన చుట్టూ ఉన్న ట్రాఫిక్‌ను డిస్‌ప్లే స్క్రీన్‌పై రైడర్ చూసే అవకాశం ఉంది.

ALSO READ: శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 రిపేర్ చేయడం కష్టం

వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వ్యవస్థ దీని సొంతం. ప్రొటోటైప్ మాత్రమే అయినప్పటికీ పనితీరు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. గరుడ ఎకో మోడ్‌లో 220 కిలోమీటర్లు కాగా, అదే స్పోర్ట్ మోడ్‌లో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. లిథియం, అయాన్ బ్యాటరీ కావడంతో కేవలం రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.మార్కెట్లో ఉండే ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది.

ముగ్గురు విద్యార్థులు కేవలం ఏడాది సమయంలో దీన్ని రూపొందించారు. ఆటోమొబైల్ నిపుణుడు వినోద్ దేశాయ్ ఈ స్టూడెంట్స్‌ని ప్రశంసించారు. యువత సృజనాత్మకత ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. వేస్ట్ టు బెస్ట్ అనే సూత్రానికి అనుగుణంగా వాహనాన్ని తయారు చేయడం బాగుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ సిటీలోని భగవాన్ మహావీర్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×