Srushti Fertility IVF Scam: సృష్టి ఫెర్టిలిటీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతో పెద్ద ఎత్తున పిల్లలను విక్రయించనట్లు పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో.. డాక్టర్ నమ్రత నుంచి కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నమ్రత సరోగసి పేరిట ఒక్కొక్కరి దగ్గర దాదపు 30 నుంచి 40 లక్షలు వసూలు చేసిందని దర్యాప్తులో తేలింది. పిల్లల విక్రయం ద్వారా 20కోట్ల రూపాయిల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె బ్యాంక్ అకౌంట్‌పై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించనున్నారు గోపాలపురం పోలీసులు. నమ్రత ఆస్తులకు సంబంధించన వివరాలు ఇవ్వాలని.. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖ రాశారు. మరోసారి ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ నమ్రత కస్టడీ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది.
పిల్లలను విక్రయించిన ముగ్గురు తల్లులు అరెస్ట్
ఈ కేసులో ఇప్పటివరకు 27 మంది నిందితులను గోపాలపురం పోలీసుల అరెస్టు చేశారు. సృష్టి ఫెర్టలిటీ మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోషిని విచారణ చేయగా .. నమ్రత ఏం చెప్తే అదే చేశామని సమాధానం ఇచ్చారు. కొత్తగా ఇద్దరు, డాక్టర్లు, ముగ్గురు ఏజెంట్లు సహా పిల్లలను విక్రయించిన ముగ్గురు తల్లులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఎంబ్రియాల్జిస్ట్‌గా చేస్తున్న డాక్టర్ అనుశ్రీ, అనస్థీషియా డాక్టర్ రవిలను అరెస్ట్ చేసిన పోలీసులు. వైజాగ్ సృష్టి సెంటర్‌లో ఎంబ్రియాల్జిస్ట్‌గా ఉన్న డాక్టర్ రమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ 8 మందిని మెజస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. పిల్లల తల్లిదండ్రులను గుర్తించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంతోషితో లావాదేవీలు జరిపిన వారిని గుర్తిస్తున్నారు. కళ్యాణి వద్ద నుంచి పిల్లల తల్లిదండ్రుల వివరాలను ఆరా తీస్తున్నారు.
ఫర్టిలిటీ సెంటర్ల రెయిడ్స్‌లో షాకింగ్ నిజాలు..
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫర్టిలిటీ సెంటర్లు తనిఖీలు చేసిన అధికారులు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను గుర్తించారు. సృష్టి ఫర్టిలిటీ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో DMHOల పర్యవేక్షణలో ఏకంగా 35 ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో జల్లెడ పట్టాయి. ఫర్టిలిటీ కేంద్రాలు, గైనకాలజీ క్లినిక్ లపై రెయిడ్స్ చేశారు. రూల్స్ పాటించని కేంద్రాల వివరాలను రిపోర్టు రూపంలో తయారు చేశారు. ఆ నివేదికలు ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 381 ఫర్టిలిటీ కేంద్రాలుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 271
సరోగసీ స్కానింగ్ కేంద్రాలన్నీ నిర్లక్ష్యంగా నడుస్తున్నట్లు తనిఖీ టీమ్స్ గుర్తించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 381 ఫర్టిలిటీ కేంద్రాలుండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 271 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 50 శాతానికి పైగా కేంద్రాల్లో అధికారులు తప్పిదాలను గుర్తించారు. ఇందులో ఏళ్ల తరబడి నిబంధనలు పాటించని సెంటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూల్స్ పాటించని కేంద్రాల వివరాలను తనిఖీల బృందాలు ప్రభుత్వానికి పంపాయి. ఏకంగా 50 శాతానికి పై బడిన ఆయా కేంద్రాలకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు లిస్టు తయారు చేసిన వైద్యాధికారులు ఒకటి రెండు రోజుల్లో ఫేక్ కేంద్రాలకు నోటీసులు అందజేయనున్నారు.
స్కానింగ్స్ నుంచి రికార్డుల వరకు తప్పుల తడక
ఫర్టిలిటీ సెంటర్లలో స్కానింగ్ నుంచి రికార్డుల వరకు తప్పుల తడకగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మ్యానువల్‌గా మెయింటెన్ చేసే రికార్డులు, ఆన్ లైన్ పోర్టల్ కు చాలా వ్యత్సాసాలు ఉన్నాయి. స్కానింగ్ లు, ప్రెగ్నెన్సీ వివరాలు, సరోగసీ డీటెయిల్స్, బేబీ, మధర్ వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. కొన్ని ఫర్టిలిటీ సెంటర్లలో ఎంబ్రాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండానే నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో పొందుపరిచిన రేడియాలజిస్టుల పేర్లను చూపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి ఆయా డాక్టర్లు, టెక్నికల్ స్టాఫ్ లేకున్నా.. వాళ్ల పేర్లతోనే కొన్ని కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయి.
సెంటర్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు నిర్లక్ష్యం
కొన్నికేంద్రాలు అసిస్టెంట్లతో, ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహిస్తున్నారు. ఫర్టిలిటీ సెంటర్లలో పనిచేస్తున్న స్టాఫ్‌కు, ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్న సంఖ్యకు ఎలాంటి పొంతన లేకుండా ఉన్నది. ఆధార్ కార్డుల వివరాలను కూడా తప్పుగా ఎంట్రీ చేస్తున్న కేంద్రాలూ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ డీటేయిల్స్ లో కొన్ని కేంద్రాలు పబ్లిక్‌ను మోసం చేస్తున్నాయంటూ అధికారులు ఇన్వేస్టిగేషన్‌లో తేలింది. ఈ కేంద్రాలన్నీ అన్ని జిల్లాల్లో ఏజెంట్లను పెట్టుకుని పబ్లిక్‌ను బురిడి కొట్టేందుకు నిత్యం ప్లాన్ చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. PCNTD టీడీ యాక్ట్ ప్రకారం స్కానింగ్‌లు, గర్భిణీల వివరాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఆధీనంలోని పోర్టల్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెల తప్పనిసరిగా వైద్యాధికారులకు నివేదిక పంపించాలి. చాలా కేంద్రాలు ఏళ్ల తరబడి వీటిని పక్కకు పడేశాయి. ధనార్జనే థ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ఇక సెంటర్ లోని అధికారులు, ఈ కేంద్రాలకు పర్మిషన్లు ఇచ్చే ఆఫీసర్ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నట్లు అధికారులు తమ రెయిడ్స్‌లో అంచనాకు వచ్చారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!
నిత్యం వైద్యాధికారుల నుంచి మానిటరింగ్ లేకపోవడం వలే ఇలాంటి కేంద్రాలన్నీ ధైర్యంగా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు, నిర్లక్ష్యం, ఉన్నాయనే విషయాలను స్పష్టమైన వివరాలతో తనికీ బృందాలు తమ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత నోటీసులు ఇవ్వనున్నారు. జాయింట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లోనూ రెయిడ్స్ మొదలు పెట్టనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ కు ప్రత్యేక టీమ్స్ వెళ్లనున్నాయి.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో సంచలన విషయాలు..
సరోగసీ పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు నిర్థారణ
డాక్టర్ నమ్రతా 5 రోజుల కస్టడీలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
పిల్లల విక్రయం ద్వారా డాక్టర్ నమ్రత రూ.20 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించిన పోలీసులు pic.twitter.com/fcOq0bjLoV
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2025