Infinix Hot 60i| స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ తన కొత్త బడ్జెట్ మోడల్ ఇన్ఫినిక్స్ హాట్ 60iని లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ని భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో సైలెంగ్ గా విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 60 సిరీస్‌లో ఇదే మొదటి ఫోన్. ఈ స్టార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 50iని పోలి ఉంటుంది. ఇందులో 6.78 అంగుళాల LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ ప్రాసెసర్, 256GB వరకు స్టోరేజ్, 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 60i ధర, లభ్యత వివరాలు
ఇన్ఫినిక్స్ హాట్ 60i ధర బంగ్లాదేశ్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు BDT 13,999 (సుమారు రూ. 9,800). 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర BDT 16,499 (సుమారు రూ. 11,500). ఈ ఫోన్ స్లీక్ బ్లాక్, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది. ఇది బంగ్లాదేశ్‌లోని మొబైల్‌డోకన్ వెబ్‌సైట్‌లో మాత్రమే లిస్ట్ చేయబడింది. ఈ ఫోన్ భారతదేశంలో లేదా ఇతర మార్కెట్లలో విడుదల ఎప్పుడు జరుగుతుందో దానిపై స్పష్టత లేదు. అయితే బడ్జెట్ ఫోన్లకు భారత్ మంచి మార్కెట్ కావడంతో త్వరలోనే ఇండియాలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ డ్యూయల్-సిమ్ (నానో+నానో) ఫోన్ XOS 15.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్-HD+ (1,080×2,460 పిక్సెల్స్) IPS LCD స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 396ppi పిక్సెల్ డెన్సిటీ, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్‌లో 12nm ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్ చిప్, 8GB వరకు ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/1.8 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (f/2.0 అపెర్చర్) ఉంది.
ఈ ఫోన్ 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5, NFC, GPS/A-GPS కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5,160mAh బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో యాక్సిలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ఈ ఫోన్ కొలతలు.. 167.9×75.6×7.7 మి.మీ.
Also Read: ఫారిన్ కంట్రీలో నెలకు రూ.1.5 లక్ష జీతం.. తెలంగాణ ప్రభుత్వ ఏజెన్సీ రిక్రూట్మెంట్
ఈ ఫోన్ తక్కువ ధరలో ఆధునిక ఫీచర్లను అందిస్తుంది. 120Hz స్క్రీన్ సాఫ్ట్‌గా స్క్రోలింగ్ అనుభవాన్ని ఇస్తుంది, అలాగే 50MP కెమెరా మంచి ఫొటోలను తీస్తుంది. 5,160mAh బ్యాటరీ రోజంతా ఉపయోగానికి సరిపోతుంది. 45W ఛార్జింగ్ వేగంగా బ్యాటరీని నింపుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 60i సాధారణ యూజర్లకు, బడ్జెట్‌లో మంచి ఫోన్ కోరుకునే వారికి గొప్ప ఎంపికగా కనిపిస్తుంది.
Also Read: రూ.50,000 డిస్కౌంట్.. 200MP కెమెరాగల సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్‌పై భారీ తగ్గింపు