BigTV English

Raghava Lawrence: చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాఘవ ఆవేదన.. ఒక్కసారి కలువు అంటూ ఎమోషనల్!

Raghava Lawrence: చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాఘవ ఆవేదన.. ఒక్కసారి కలువు అంటూ ఎమోషనల్!

Raghava Lawrence:రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటుడిగా.. డైరెక్టర్ గా.. కొరియోగ్రాఫర్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ గా.. ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యారు. రాఘవ లారెన్స్ సినిమాల కంటే ఎక్కువగా ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారానే మరింత గుర్తింపు సంపాదించారు.. రాఘవ లారెన్స్ తనకున్న డబ్బులలో ఎంతో కొంత సహాయం చేస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వందలాది మంది అనాధలను చదివిస్తూ.. వారికి తిండి పెడుతూ ఎంతో పుణ్యం మూట కట్టుకుంటున్నారు.. అయితే అలాంటి రాఘవ లారెన్స్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో..” నిన్ను కొట్టను రా.. మళ్లీ తిరిగిరా..” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ బాధపడుతున్నారు. మరి ఇంతకీ రాఘవ లారెన్స్ పెట్టిన ఆ పోస్ట్ ఎవరి గురించి అనేది చూస్తే..


చైల్డ్ ఆర్టిస్ట్ కోసం రాఘవ లారెన్స్ తపన..

విక్రమార్కుడు (Vikramarkudu), మాస్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రవి రాథోడ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే ఈయన పేరు గుర్తుకు రాకపోవచ్చు.కానీ ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపడతారు. అయితే అలాంటి రవి రాథోడ్ ని మాస్ సినిమా(Mass Movie) షూటింగ్ సమయంలో రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నారు. దానికి కారణం ఆ షూటింగ్ టైంలో రవి రాథోడ్ పేరెంట్స్ మరణించడమే. దాంతో లారెన్స్ రవి రాథోడ్ ని దత్తత తీసుకొని, స్కూల్లో చేర్పించారు. కానీ స్కూల్లో వేసిన సంవత్సరానికే రవి రాథోడ్ (Ravi Rathode) అక్కడి నుండి పారిపోయాడు.. ఆ తర్వాత లారెన్స్ చాలా బాధపడ్డారు. కానీ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రవి రాథోడ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఆ ఇంటర్వ్యూలో లారెన్స్ గారు చాలా మంచివారు. ఆయన నన్ను దత్తత తీసుకొని స్కూల్లో చేర్పించారని, కానీ నేను స్కూల్ నుండి తప్పించుకున్నానని, ఇప్పుడు నేను లారెన్స్ గారికి కనిపిస్తే నన్ను తిడతారో. కొడతారో అంటూ మాట్లాడారు.


నేను కొట్టను.. ఒక్కసారి కలువు అంటూ రాఘవ ఎమోషనల్

అయితే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఇది కాస్త లారెన్స్ దగ్గరికి చేరింది. అయితే ఈ వీడియో చూసి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రాఘవ లారెన్స్ .. “రవి నేను నిన్ను కొట్టనురా.. తిట్టనురా.. మళ్ళీ తిరిగి రారా.. నువ్వు తప్పిపోయాక చాలా రోజులు నేను వెతికాను. ప్రస్తుతం ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూసి నా గుండె తరుక్కుపోతుంది.. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది.. నువ్వు పారిపోయినందుకు నిన్ను కొట్టను.. తిట్టను.. నువ్వు అస్సలు భయపడకు.. మళ్లీ తిరిగి నన్ను కలువురా.. నిన్ను చూడాలి ” అంటూ రాఘవ లారెన్స్ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. మరి ఈ పోస్టు రవి రాథోడ్ దాకా చేరి మళ్ళీ రాఘవ లారెన్స్ ని కలుస్తారా లేదా అనేది చూడాలి.

ALSO READ:Pawan Kalyan: ఆస్కార్ కమిటీ సభ్యుడిగా సౌత్ ఇండస్ట్రీ హీరో.. పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్!

 

Related News

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. చాలా రోజులైంది భయ్యా ఇలా చూసి!

Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?

Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!

Kangana Ranaut: సహజీవనంపై కంగనా హాట్ కామెంట్స్.. గర్భం వస్తే ఎవరిది బాధ్యత?

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Big Stories

×