BigTV English

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

iPhone 13 Price Cut: ఉఫ్ ఉఫ్.. చెమటలు పట్టించే ఐఫోన్ ఆఫర్, చాలా తక్కువకే కొనేయొచ్చు!

Amazon Great Indian Festival 2024: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగానే తన లైనప్‌లో ఉన్న కొత్త ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సేల్ ఈ నెల అంటే సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తుంది.


అమెజాన్ సేల్ సమయంలో కొనుగోలుదారులు ఐఫోన్ 13ని రూ.38,000 కంటే అతి తక్కువకు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో Samsung Galaxy S23 Ultra, Xiaomi 14 వంటి ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఊహకందని ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సంస్థ ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఇప్పుడు అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కొనుగోలుదారులు ఇప్పుడు ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్‌లో తమకు నచ్చిన ప్రొడెక్టులను విష్‌లిస్ట్ చేసుకోవచ్చు. దీని కారణంగా సేల్ స్టార్ట్ అయిన వెంటనే వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు. కాగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఇప్పటికే రాబోయే సేల్‌కు ముందు అనేక కిక్‌స్టార్టర్ డీల్స్‌ను లైవ్‌లో ఉంచింది. కొనుగోలుదారులు తమ అభిమాన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.


Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

iPhone 13, Samsung Galaxy S23 Ultra

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ‘‘King of All Deals’’ అనే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ79,900 ధరతో విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.49,900లకు లిస్ట్ అయింది. ఇక కస్టమర్లు అమెజాన్ సేల్‌ సమయంలో ఐఫోన్ 13ను బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.37,999లకి సొంతం చేసుకోవచ్చు.

దీంతో ఎప్పట్నుంచో ఐఫోన్లపై భారీ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఈ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Apple A15 బయోనిక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఇది 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఐఫోన్ 13 ఆఫర్‌తో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం గత సంవత్సరం స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S23 Ultra ధరను తగ్గించింది. ఇది రూ. 1,49,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.69,999లకి అమెజాన్‌ సేల్‌ సమయంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఆఫర్‌లో బ్యాంక్, కూపన్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా Xiaomi 14 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సమయంలో ధర తగ్గింపుతో కూడా అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర లాంచ్ సమయంలో రూ.69,999లకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సేల్ సమయంలో ఇది రూ.47,999లకి సొంతం చేసుకోవచ్చు.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×