BigTV English

Actress Kriti Sanon: రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన బాలీవుడ్‌ నటి

Actress Kriti Sanon: రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన బాలీవుడ్‌ నటి

Bollywood Actress Who Opened Her Lips About Relationship: టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రభాస్,మహేశ్‌బాబు, నాగచైతన్య యాక్ట్ చేసిన మూవీస్‌తో టాలీవుడ్ ఆడియెన్స్‌ని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ గుర్తుందిగా.. అయినా టాలీవుడ్‌కి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆన్‌ ​స్క్రీన్‌​తో పాటుగా, ఆఫ్​ స్క్రీన్‌​లోనూ తన గ్లామర్‌తో ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తనకన్నా వయసులో చిన్నవాడైన కబీర్‌ బహియాతో రిలేషన్​షిప్‌​లో ఉన్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా ఈ విషయమై ఆమె రియాక్ట్ అయింది. తాను డేటింగ్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన రూమర్స్‌ తనను ఎంతగానో బాధ పెట్టాయని అంది.


ఆ రూమర్స్‌ను ఖండించిన ఆమె అవి తన ఫ్యామిలీపై కూడా ఎఫెక్ట్ చూపినట్లు తెలిపింది. అంతేకాకుండా నా గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్​ కూడా బాధపడతారంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది. దాని కారణంగా ప్రాబ్లమ్స్‌ని మేమంతా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తెలిపింది. ఎలాంటి న్యూస్‌ అయినా సోషల్‌ మీడియా ద్వారా ఇట్టే త్వరగా ప్రజల్లోకి వెళ్లిపోతుంటాయి. అవి నిజం అనుకుని చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తుంటారు. వీటిపై రియాక్ట్ అవ్వాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందంటూ తెలిపింది. 34 ఏళ్ల కృతి తన కన్నా 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్​లో ఉందని ఓ హెడ్డింగ్‌తో నెట్టింట రిలీజ్ చేశారు. అందులో నిజమెంత అని తెలుసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రాసుకొచ్చారు. ఇలా రాయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయిందంటూ తాను చాలా ఎమోషనల్ అయింది. గతంలో అంటే సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్​ పేపర్స్​ చూసి ప్రజలు ఓ ఒపీనియన్‌కి వచ్చేవారు..

Also Read: పూరీ, మణిశర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రామ్


కానీ ఇప్పుడు అలా లేనే లేదు. ఆన్‌లైన్‌లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకుంటున్నారు. నెగెటివ్ కామెంట్స్‌ పెట్టడం బాగా ట్రెండ్‌​గా మారిపోయింది. తమ ఒపీనియన్‌లను ఫ్రీగా వ్యక్తం చేయడం, అవతలి వ్యక్తిపై మ్యాటర్ తెలియకుండా రూమర్స్‌ కావాలనే క్రియేట్‌ చేయడం రెండూ ఒకటి కాదంటూ కృతి అసహనం వ్యక్తం చేస్తూ ఈ కామెంట్లను బయటపెట్టింది.కాగా ఇటీవలే క్రూ మూవీతో కృతిసనన్ హిట్‌ని అందుకుంది. అలానే 2021 ఏడాదిలో రిలీజ్ అయినా మిమీ చిత్రంలో నటించింది. అంతేకాదు ఈ మూవీకిగాను నేషనల్ అవార్డును సొంతం చేసుకుని ఉత్తమ నటిగా మంచి ఐడెంటీటీని సంపాదించుకుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×