BigTV English

iPhone 17 Air Vs iPhone SE 4 : ఈ మెుబైల్స్ ఫీచర్స్ లో తేడాలు ఏంటంటే..!

iPhone 17 Air Vs iPhone SE 4 : ఈ మెుబైల్స్ ఫీచర్స్ లో తేడాలు ఏంటంటే..!

iPhone 17 Air Vs iPhone SE 4 : ఈ ఏడాది దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ రెండు ప్రధాన ఐఫోన్ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అవే iPhone 17 Air, iPhone SE 4. సాధారణంగానే.. ఐఫోన్ కొత్త మోడల్ తో వస్తుంది అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది.. సరికొత్త ఫీచర్లతో ప్రస్తుతం అందిస్తున్న సీరిస్ కు భిన్నంగా ఈ రెండు మోడళ్లు సిద్ధమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో.. ఆయా ఫోన్ల స్పెసిఫికేషన్లతో పాటు డిజైన్, కెమెరా, ఫీచర్లు వంటి విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలను మీరు తెలుసుకొండి.


iPhone 17 Air డిజైన్ చాలా స్లిమ్ గా, తేలికగా ఉండేలా రూపొందించారు. ఇది ఫ్రేమ్‌లెస్ స్క్రీన్, పాటలెస్ బ్యాక్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఇక ఈ మోడల్ లో 5.7 నుంచి 6.1 అంగుళాల OLED డిస్ ప్లే తో, హై రిజల్యూషన్ స్క్రీనింగ్ అందుబాటులోకి వస్తుంది. ఇక ProMotion టెక్నాలజీతో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. బాడీ విషయంలో ఐఫోన్ ఎప్పుడూ ప్రత్యేకంగానే నిలుస్తుంటుంది. అలానే.. ఈ మోడల్ లోనూ అల్యూమినియం లేదా టైటానియం బాడీతో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది.. ఈ మోడల్.

iPhone SE 4 డిజైన్ చాలా సాదాసీదాగానే ఉండనుంది. ఇది ప్రస్తుత iPhone 13 లేదా iPhone 14 లాంటి బిజెల్‌లెస్ డిజైన్‌తో ఉండకపోయినా, ఇంకా ఫిజికల్ హోం బటన్ కలిగి ఉంటుందని అంటున్నారు. iPhone SE 4లో 4.7 అంగుళాల LCD డిస్ ప్లే ఇవ్వనుండగా.. పై మోడల్ తో పోల్చితే కొంచెం తక్కువ రిజల్యూషన్‌ అందిస్తుంది అంటున్నారు. ఇది IPS ప్యానల్‌తో అందుబాటులోకి రానుంది. ఇక బాడీ విషయంలో తన ప్రత్యేకతను చాటుకోనుంది.. ఈ మోడల్. అది పూర్తిగా అల్యూమినియం, గ్లాస్ బాగ్ బాడీతో రూపుదిద్దుకుంటుంది.


ALSO READ : ఆ కంపెనీ సీఈవో అయితే చాలు.. లైఫ్ సెట్.. 4 నెలల జీతం రూ.827 కోట్లు

iPhone 17 Air డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉండనుంది. అందులో ఒకటి 48MP ప్రైమరీ కెమెరా కాగా, మరొకటి 12MP వైడ్ లేదా అల్ట్రా వైడ్ కెమెరా. క్వాలిటీ ఫిచర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యాపిల్ ఐ ఫోన్లు.. ఈ ఫోన్లల్లోనూ ఆ ప్రత్యేకతను కొనసాగించనుంది. అందులో భాగంగానే.. ఆప్టికల్ జూమ్, నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్ సహా ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్ (OIS) వంటి మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉండనున్నాయి. iPhone 17 Airలో 12MP ట్రూ డెప్త్ సెన్సర్ ఉండనుండగా.. ఇది పోర్ట్రైట్ మోడ్, ఫేస్ ఐడీ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇక iPhone SE 4 మోడల్ దగ్గరకు వచ్చే.. ఇది 12MP ప్రైమరీ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది సాధారణ ఫోటోగ్రఫీ కోసం సరిపోతుంది, కానీ iPhone 17 Air తో పోలిస్తే కొంత తక్కువ ఫీచర్లను అందిస్తుందని చెబుతున్నారు. SE 4 కెమెరా సిస్టమ్‌లో నైట్ మోడ్ లేకపోవచ్చు, కానీ ఫోటో, వీడియో పరంగా మంచి నాణ్యత ఉంటుందని అంటున్నారు. ఈ మోడల్ లో 7MP ఫ్రంట్ కెమెరా ఉండనుండగా.. ఇది పోర్ట్రైట్ మోడ్, రెటినా ఫ్లాష్ ఫీచర్లను సపోర్ట్ చేయనుంది.

iPhone 17 Airలో A17 బయోనిక్ చిప్,6GB RAM లేదా 8GB RAM, 4000mAh లేదా 4500mAh బ్యాటరీతో 20W లేదా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. iPhone SE 4లో A15 బయోనిక్ చిప్, 4GB RAM  3000mAh లేదా 3500mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉండొచ్చు. iPhone 17 Air ధర రూ. 85,000 నుంచి రూ. 95,000 మధ్య ఉండే అవకాశం ఉండగా.. iPhone SE 4 ధర రూ.40వేల నుంచి రూ.45వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

 

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×