Jobs in BDL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, ఎంబీఏ- బిజినెస్ డెవలప్ మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, ఎల్ఎల్‌బీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
హైదరాబాద్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 49
ఇందులో మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్, బిజినెస్ డెవలప్ మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, అఫీషియల్ లాంగ్వేజ్, లీగల్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కెమికల్, సివిల్ పాసై ఉండాలి. బిజినెస్ డెవలప్ మెంట్, పబ్లిక్ రిలేషన్, ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్ విభాగాల్లో ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది. కొన్ని ఉద్యోగాలకు ఎల్ఎల్‌బీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: వివిధ విభాగాల్లో పోస్టులను అనుసరించి 27 నుంచి 57 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: మేనేజ్ మెంట్ ట్రైనీ, ఏఎం లీగల్ పోస్టులకు రూ.40,000- 1,40,000, ఎస్ ఎం పోస్టుకు రూ.70,000- రూ.2,00,000, డీజీఎం పోస్టుకు రూ.80,000 నుంచి రూ.2,20,000
దరఖాస్తు ఫీజు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 21
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bdl-india.in/recruitment
Also Read: RRC Jobs: సువర్ణవకాశం.. రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టులు.. పూర్తి వివరాలివే..
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యో్గాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే భారీ జీతం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.