Brian Niccol : టాప్ కాఫీ బ్రాండ్ స్టార్ బక్స్ (Star bucks) సీఈఓ బ్రియాన్ నికోల్ (Brian Niccol) రికార్డు క్రియేట్ చేశారు. యాపిల్ సీఈఓ టిక్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంటే ఎక్కువ వేతనాన్ని అందుకున్న సీఈవోగా నిలిచారు.
ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్… అమెరికాలో అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ. ఈ కంపెనీకి సీఈవో బ్రియాన్ నికోల్. ప్రస్తుతం ఈయన.. టెక్ దిగ్గజం యాపిల్, సెర్చ్ ఇంజన్ గూగుల్ సీఈవోల వేతనం కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. ఈ కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే సుమారు రూ.827 కోట్లు అందుకున్నారు.
బ్రియాన్ నికోల్… స్టార్‌బక్స్ సీఈవోగా తన మొదటి నాలుగు నెలలకే 96 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.827 కోట్లు) వేతనం అందుకున్నారు. ప్రస్తుతం అమెరికా కార్పొరేట్ కంపెనీల్లో అతిపెద్ద ప్యాకేజీల్లో ఇది ఒకటిగా నిలిచింది. టెక్ కంపెనీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) మెుదటి నాలుగు నెలలకే 75 మిలియన్ డాలర్లు (సుమారు రూ.646 కోట్లు) అందుకున్నారు. అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం (Sundar Pichai ) ఇదే స్థాయి వేతనాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.
ALSO READ : గుడ్ న్యూస్.. దిగివచ్చిన ఎయిర్‌టెల్.. ఆ రీఛార్జ్ ప్లాన్ పై ఏకంగా రూ.110 తగ్గింపు
ఇక స్టార్ బక్స్ లో అమ్మకాలు క్షీణించిన సమయంలో ఆ కంపెనీ సీఈవోగా భారత్ సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఉన్నారు. కంపెనీ లాస్ లో నడవటంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆపై బ్రియాన్ నికోల్ స్టార్ బక్స్ బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ ప్రారంభంలో స్టార్ బక్స్ సీఈవోగా నికోల్ బాధ్యతలు చేపట్టారు. కంపెనీలో చేరిన తర్వాత ఐదు మిలియన్ డాలర్లు సైన్-అప్ బోనస్ ఈయనకు అందింది. జీతంలో దాదాపు 94 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే వచ్చినట్టు బ్లూమ్స్ బర్గ్ తెలిపింది. దీంతో అమెరికాలో అధిక వేతనం అందుకునే సీఈఓలలో ఒకరిగా నిలిచారు నికోలస్. నిజానికి టాప్ 20లో ఒకరిగా నిలిచారు. అయితే నికోల్ ను నియమించుకునే సమయంలో వార్షిక వేతనం 103 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. నాలుగు నెలలకే 96 మిలియన్ డాలర్లు అందుకోవటం చెప్పుకోదగిన విషయం.
నిజానికి నికోల్ కు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే వేతనం అందిందనే చెప్పాలి. ఇందుకు కారణం ఆయన ఉంటున్న ప్రాంతంలో తాత్కాలిక గృహ ఖర్చులు ఎక్కువగా ఉండటమే. ఈ గృహ ఖర్చులను భరించేందుకు కంపెనీ అంగీకరించింది. అంతేకాకుండా కంపెనీ జెట్ ను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం శుక్రవారం దాఖలు చేసిన వివరాలతో నికోల్ గృహ వినియోగం కోసం 1,43,000 డాలర్లు అధికంగా కంపెనీ చెల్లించింది. దీంతో పాటు దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న తన ఇంటి నుంచి సీటెల్‌లోని స్టార్‌బక్స్ కార్యాలయానికి ప్రయాణించటానిరి మరో 72 వేల డాలర్లు అదనంగా ఖర్చయింది. ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం సుమారు 19 వేల డాలర్లు ఖర్చు కావటంతో నికోల్ కు అనుకున్న వేతనం కంటే ఎక్కువ చెల్లించాల్సి వచ్చినట్లు తెలుస్తుంది.