iQOO 12 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ప్రారంభమైంది. ఈసేల్ లో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఇక టాప్ కంపెనీ ఐక్యూపై అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. డిసెంబర్ 4న ఐక్యూ 13 సిరీస్ లాంచ్ కావడంతో ప్రస్తుతం దీని ముందు సిరీస్ పై అమెజామ్ ఆఫర్స్ ఇచ్చిపడేసింది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ సేల్ లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ప్రతి అమెజాన్ సేల్ ఈవెంట్ మాదిరిగానే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సేల్ కూడా స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఇక iQOO 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకునే యూజర్స్ కు ఇదే బెస్ట్ ఛాన్స్. ఈ మెుబైల్ పై అమెజాన్ అదిరే ఆఫర్ ను అందించటంతో రూ. 45,999కే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే అమెజాన్ రూ.3,000 విలువైన కూపన్‌ను సైతం అందిస్తోంది.
iQOO 12 ఇండియా ధర రూ. 52,999 వద్ద మెుదలైంది. ప్రస్తుతం, అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.45,999 తగ్గింపు ధరతో అందిస్తోంది. అలాగే, అమెజాన్ రూ.3,000 విలువైన కూపన్ ఇవ్వటంతో.. దీని ధరను రూ.42,999కి తగ్గించింది. ఇక SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ లో ఎక్స్ఛేంజ్ సదుపాయం కూడా కలదు.
iQOO 12 Features –
డిస్ ప్లే : iQOO 12లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది, 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో సుపీరియర్ విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.
ప్రాసెసర్ : iQOO 12 మెుబైల్ Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో మంచి పనితీరును, అధిక వేగాన్ని అందిస్తుంది.
క్యామెరా : iQOO 12లో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, 13MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉన్న మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.
RAM – STORAGE : 8GB/12GB RAM, 256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం ఉంది.
బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.
ప్రత్యేక గేమింగ్ ఫీచర్లు : iQOO 12 గేమింగ్ కోసం ప్రత్యేకంగా X-సిరీస్ కూలింగ్ టెక్నాలజీ ఉంది.
5G సపోర్ట్ : 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో అధిక డేటా వేగాన్ని అందిస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : Android 14 ఆధారిత Origin OS 3.0 ఇన్స్టాల్ చేశారు. ఇది స్మూత్, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది.
డిజైన్ : iQOO 12 ప్రీమియమ్ డిజైన్, అల్యూమినియం బాడీ, ఆకర్షణీయమైన లుక్స్ ను కలిగి ఉంది.
సెన్సార్స్ : ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరో, ఎంఎస్ సెన్సర్, ఏకో స్పీకర్ సౌండ్ ఎఫెక్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.
ఇక గేమింగ్ కోసం బెస్ట్ ఫీచర్ మొబైల్ ను కొనాలనుకునే వారికి ఈ మెుబైల్ బెస్ట్ ఆప్షన్. ఇందులో అదిరిపోయే ప్రాసెసర్ తో పాటు గేమింగ్ ఫీచర్స్, ఫోటోగ్రఫీ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. తక్కువ ధరకే బెస్ట్ మొబైల్ కొనాలనుకునే యూజెర్స్ కచ్చితంగా ట్రై చేసేయండి.
ALSO READ : 5Gకి, జియో 5.5కి తేడా ఏంటి? ప్రస్తుతం ఉన్న మొబైల్స్ కు పని చేస్తుందా?