భారతీయ టెలికాం దిగ్గజం రియలయన్స్ జియో రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా తమ కస్టమర్లకు అత్యుత్తమ 5G సేవలను అందిస్తున్నది. ప్రస్తుతం దేశంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న నెట్ వర్క్ గా జియో దూసుకెళ్తున్నది. జియోకు పోటీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు ఉన్నప్పటికీ జియో వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. వొడాఫోన్ ఐడియా త్వరలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించగా, బీఎస్ఎస్ఎన్ఎల్ ఇప్పటీ 4G సేవలనే అందిస్తున్నది. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక రిలయన్స్ జియో 5G నెట్ వర్క్ ను అప్ డేట్ చేసింది. ఇప్పటి వరకు తన కస్లమర్లకు 5G సేవలు అందించగా, ఇకపై 5.5G సేవలను అందించబోతున్నది.
ఇంతకీ 5.5G నెట్ వర్క్ అంటే ఏంటి?
జియో 5G వెర్షన్ కు అప్ డేట్ వెర్షన్ ఈ 5.5G నెట్ వర్క్. సాధారణంగా 5Gతో పోల్చితే ఇది మరింత వేగంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ను చాలా ఫాస్ట్ గా అందిస్తుంది. ఈ వ్యవస్థ మూడు నెట్ వర్క్ సెల్స్ ను ఉపయోగిస్తుంది. అవి ఒకేసారి ఎక్కువ టవర్స్ కు కనెక్ట్ అవుతాయి. కస్టమర్లు 1GBPS నుంచి 10GBPS వరకు ఇంటర్నెట్ స్పీడ్ తో వీడియోలు, సినిమాలు చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రామాణిక నెట్ వర్క్ లో జియో గరిష్టగా 277.78ఎంబీపీఎస్ స్పీడ్ ను అందించాయి. అత్యధికంగా 1014 ఎంబీపీఎస్ స్పీడ్ ను కూడా మించిపోయింది. ఇక 5.5G టెక్నాలజీ మరింత వేగవంతమైన నెట్ వర్క్ ను అందించనుంది.
జియో 5.5Gతో లాభాలు ఏంటి?
జియో కంపెనీ 5.5G నెట్ వర్క్ ద్వారా ప్రస్తుతంతో పోల్చితే గణనీయమైన నెట్ వేగాన్ని పొందే అవకాశం ఉంటుంది. వేగవంతమైన బ్రౌజింగ్ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. అత్యంత వేగంగా డౌన్ లోడ్, అప్ లోడ్ సౌకర్యాన్ని పొందవచ్చు. వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్, మెరుగైన కాల్ క్వాలిటీ పొందే అవకాశం ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లోనూ మంచి నెట్ వర్క్ ను అందుకోవచ్చు. వైర్ లెస్ నెట్ వర్క్ ను అప్ డేట్ చేయడం వల్ల పారిశ్రామిక వినియోగానికి 5.5G నెట్ వర్క్ ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also: జియో పేరుతో కొత్త స్కామ్, అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!
5.5G సపోర్టు చేసే మోబైల్స్ ఏవి?
జియో తాజాగా తీసుకొచ్చిన 5.5G నెట్ వర్క్ ను వన్ ప్లస్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో పొందే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లు జియో లేటెస్ట్ నెట్ వర్క్ టెక్నాలజీకి అనుగుణంగా పని చేసేలా రూపొందించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ ఫోన్లు మాత్రమే 5.5Gకి మద్దతు ఇవ్వనున్నాయి. ఇకపై మార్కెట్లో అందుబాటులోకి వచ్చే స్మార్ట్ ఫోన్లు ఈ వెర్షన్ ను సపోర్టు చేసేలా రూపొందే అవకాశం ఉంటుంది.
Read Also: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్, రూ. 1234తో ఏడాది వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్!