BigTV English

Airport In Kothagudem : తెలంగాణలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్.. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్‌ను ఎవరూ ఆపలేరు..

Airport In Kothagudem : తెలంగాణలో కొత్తగా మరో ఎయిర్‌పోర్ట్.. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్‌ను ఎవరూ ఆపలేరు..

Airport In Kothagudem : తెలంగాణలో రానున్న రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు.. ఇప్పటికే హైదరాబాద్ మినహా ముఖ్యమైన నగరాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం నుంచి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.


కొన్ని రోజుల క్రితమే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ లో నిర్మించాలని భావిస్తున్న మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ, ప్రాజెక్టు వివరాలు, నిర్మాణాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ కు విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తాజాగా.. భద్రాది కొత్తగూడెం జిల్లాలోనూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ కోరడంతో.. గతంలో కొత్తగూడెం ప్రాంతంలో పర్యటించిన కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారులు అక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని భావిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. ఫీజిబిలిటీ సర్వే సానుకూలంగా రాకపోవడంతో విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఫీజిబిలిటీ సర్వేలో వివిధ అంశాలను నిపుణులు పరిశీలిస్తుంటారు. ఎయిర్ పోర్టు నిర్మిస్తున్న ప్రాంతం.. దగ్గర్లోని ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకల సాధ్యాసాధ్యాలు, విమానాశ్రయ నిర్మాణానికి అయ్యే ఖర్చు, వినియోగించాల్సిన సాంకేతికతలు, ఇతర ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తుంటారు. ఈ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రాకుంటే.. ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు.


కానీ.. కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్ పోర్టు రావడం వల్ల ఆ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ ఎయిర్ పోర్టు నిర్మించాలని గట్టిగా పట్టుబడుతోంది. ఈ నేపత్యంలోనే.. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడిని కలిశారు. కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. అధికారులను ఆదేశించడంతో, అక్కడ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుపై ఏఏఐ దృష్టి సారించింది.

ఏఏఐ నుంచి నిపుణులు వచ్చి సంబంధిత ప్రాంతంలో ఫీజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాల్సిందిగా.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వెనువెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర సంస్థ కోరిన రూ.37.87 లక్షలను విడుదల చేసింది. దీంతో..ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బృందం ఈ నెల 20న కొత్తగూడెంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎయిర్ పోర్టు నిర్మించాలని భావిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఈ మేరకు.. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ పరీక్ష, సాయిల్‌ టెస్టింగ్‌తో పాటు ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నివేదిక రూపొందించనుంది.

Also read :  భారీగా ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. హైదారాబాద్ తో పాటు ఈ జిల్లాల్లో పరుగులు తీయనున్న ఈ-బస్సులు

కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణుల పర్యటన నేపథ్యంలో.. కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్‌ తదితర ప్రాంతాల్లోని 950 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. ఈ భూముల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఫీజిబిలిటీ టెస్ట్ ఫలితాలు వస్తే.. భూసేకరణ చేసి విమానాశ్రయ నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×