BigTV English

iQOO Z9x 5G Price Dropped: ధూమ్ ధమాకా ఆఫర్.. రూ.703లకే 6GB RAM iQOO Z9x 5G ఫోన్.. మొన్ననే లాంచ్.. అప్పుడే అత్యంత చౌక ధరలో దొరికేస్తోంది

iQOO Z9x 5G Price Dropped: ధూమ్ ధమాకా ఆఫర్.. రూ.703లకే 6GB RAM iQOO Z9x 5G ఫోన్.. మొన్ననే లాంచ్.. అప్పుడే అత్యంత చౌక ధరలో దొరికేస్తోంది

Buy iQOO Z9x 5G Mobile at Rs 703 Only: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO కొన్ని వారాల క్రితం తన మోడల్‌లోని మరొక కొత్త ఫోన్ iQOO Z9xను భారతదేశంలో లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సరికొత్త ఫోన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌ దీనిపై ధూమ్ ధమాకా ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 5000 కంటే ఎక్కువ ఆకర్షణీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10,000 కంటే తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్లు గల ఫోన్‌ను వెతుకుతున్నట్లయితే ఇదే మంచి అవకాశం.


iQOO Z9x 5G ఫోన్ 6GB RAM + 128GB Storage వేరియంట్ అసలు ధర రూ.18,999గా ఉంది. అయితే దీనిపై ఇప్పుడు కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు. దీనిని ఇప్పుడు 24 శాతం తగ్గింపుతో రూ. 14,499కే కొనుక్కోవచ్చు. అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్‌పై రూ. 500 తగ్గింపు కూపన్ అందించబడుతుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.13,999లకే లభిస్తుంది. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI, ICICI Bank, Axis Bank ట్రాన్షక్షన్లపై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు రూ.12,999లకే కొనుక్కోవచ్చు.

అదనంగా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. వినియోగదారులు పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే రూ.13,700 వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే పాత ఫోన్‌పై ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఇవేవి కాకుండా దీనిపై ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై EMI ఎంపికలు రూ. 703 నుండి ప్రారంభమవుతాయి. ఈ మొత్తం చెల్లించి ఈ ఫోన్‌ను ఇంటికి పట్టికెళ్లొచ్చు. ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది.


Also Read: 6,000mAh బ్యాటరీతో iQOO నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్!

స్పెసిఫికేషన్లు

iQOO Z9x 6.72-అంగుళాల 120Hz అడాప్టివ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అల్ట్రా-బ్రైట్, లీనమయ్యే ఆడియో-విజువల్ అనుభవం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అందిస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ గొప్ప ఫోటోలు, వీడియోల కోసం 50MP AI వెనుక కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనంగా స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ వెనుకవైపు 2MP బోకె కెమెరాను అందిస్తుంది. వెనుక కెమెరాలు LED ఫ్లాష్‌తో జతచేయబడి కెమెరా మాడ్యూల్‌లో ఉంటాయి. iQOO Z9x 16GB వరకు పొడిగించిన RAMని అందిస్తుంది. పరికరంలో 1TB వరకు విస్తరించదగిన స్టోరేజ్‌కు మద్దతు ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 ద్వారా ఆధారితమైనది. కంపెనీ iQOO Z9xని 2+3 సంవత్సరాల Android OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో అందిస్తుంది.

Related News

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Big Stories

×