Thaman: టాలీవుడ్ మ్యూజిక్ ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్ హవా కొనసాగుతోంది. కుర్ర హీరోల నుంచి మొదలు పెడితే, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వరకు బడా హీరోల సినిమాలకు మ్యూజిక్ వాయించి థియేటర్లను బ్లాస్ట్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలోనే ఓజి సినిమాతో మరో బంపర్ హిట్ అందుకున్నాడు. లడ్డూల కనిపిస్తాడు కానీ, అతను కొట్టే మ్యూజిక్ కు ముసలివాడు కూడా లేచి నిలబడాల్సిందే. అయితే అలాంటి తమన్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల కాలంలోనే సెంచరీ చేసిన ఎస్ఎస్ తమన్ ఇప్పుడు బౌలింగ్ లో కూడా మురళీధరన్ లాంటి వాళ్ళను మించిపోయేలా కనిపిస్తున్నాడు. 24 పరుగులు ఇచ్చే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు తమన్.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ ( Elite Cricket League 2025) జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ దాదాపు రెండు రోజులు నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన ఖాకీ బుల్లెట్స్ ( Khaki Bullets )ఫైనల్ దాకా వచ్చి, టైటిల్ ఎగురేసుకు వెళ్ళింది. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎస్ఎస్ తమన్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. కేవలం 24 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు తమన్. అతను వేసింది కూడా కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే. సినీ వారియర్స్ ( ( Khaki Bullets ) తరఫున బరిలోకి దిగిన తమన్ ఫైనల్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మురళీధరన్ తరహాలోనే బౌలింగ్ చేస్తూ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే ఖాకీ బుల్లెట్స్ జట్టుకు సంబంధించిన నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు తమన్. దీంతో తమను టీమిండియాలోకి తీసుకురండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు జనాలు.
ఉప్పల్ వేదికగా ఎలైట్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కూడా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఖాకీ బుల్లెట్స్ వర్సెస్ సినీ వారియర్స్ ( Khaki Bullets Vs Cine Warriors) తలపడ్డాయి. ఇందులో ఖాకీ బుల్లెట్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లలో 1506 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఖాకీ బుల్లెట్స్. అనంతరం చేజింగ్ కు దిగిన సినీ వారియర్స్ పెద్దగా రాణించలేదు. చివరి వరకు వచ్చి తేలిపోయింది. దీంతో 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ కప్ ఖాకీ బుల్లెట్స్ సొంతమయింది. ఇక ఖాకీ బుల్లెట్స్ కెప్టెన్ గా సీవీ ఆనంద్ ఉన్న సంగతి తెలిసిందే. తరుణ్ సినీ వారియర్స్ జట్టును లీడ్ చేశాడు.
Magician at his best ❤️@MusicThaman anna magical 4 winning performance in #ECL final 🫶
4/24 in 4 overs 😍
Guns N’ Roses
They Gonna Be Vicious
The Devil Colored Glasses
Oh They Show You The Bruises 🐉#EliteCricketLeague #CineHeros #Thaman #CricketForCause #OperationSindoor… https://t.co/l3Y9d2GqJG pic.twitter.com/oMvbvHoxJx— ThamanFandomGroup™ (@Supremo_TFG) October 12, 2025