E-Paper
Advertisement

LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్

LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్
Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరత అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించామని వెల్లడించారు. నిన్ననే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి తాజా పరిణామాలను చర్చించినట్లు తెలిపారు.

సిలిండర్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎస్‌తో పాటు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సరఫరాలో అవాంతరాలు కలగకుండా ఈ కమిటీలు నిరంతరం నిఘా ఉంచుతాయని మంత్రి వివరించారు. ఈ రోజు ఎల్‌పీజీ సరఫరాదారులు, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు.

Advertisement

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. కొరత వస్తుందనే భయంతో చాలామంది అవసరానికి మించి సిలిండర్లను బుక్ చేస్తున్నారని, ఇది కృత్రిమ కొరతకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలని కోరారు. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

మరోవైపు రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన అదనపు డొమెస్టిక్ గ్యాస్ కోటాను వెంటనే కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పౌర సరఫరాల వ్యవస్థలో ఎక్కడా లోపాలు లేకుండా చూస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×