Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ కాల్
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ స్వయంగా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్‌తో సమావేశం కావాలని ఆయన సూచించారు. ఈ నెల 23వ తేదీన వీరిద్దరూ కీలక భేటీ అవుతారు.
భేటీపై సర్వత్రా ఆసక్తి
కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న రాజగోపాల్ రెడ్డితో భేటీ అవుతన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం వివరణ కోరుతుందా..? లేక పార్టీలో అంతర్గత సమన్వయం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశారా..? అనే దానిపై నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 23న జరిగే సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం!