Jio Phone Prima 2 price: ప్రముఖ టెక్ బ్రాండ్ రిలయన్స్ జియో దేశీయ మార్కెట్‌లో దూసుకుపోతుంది. టెలికాం రంగంలోనే కాకుండా మొబైల్ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంటుంది. కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అదరగొట్టేస్తుంది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటు ధరలో ఫీచర్డ్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఊహించని ఫీచర్లను అందిస్తుంది. దీని కారణంగా ఒక మంచి ఫీచర్లు గల ఫోన్‌ను సొంతం చేసుకోవాలి అని అనుకునే వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే రిలయన్స్ జియో కంపెనీ తన లైనప్‌లో దేశంలో 2G, 3G నెట్‌వర్క్ గల ఫీచర్ ఫోన్‌లను విక్రయిస్తుంది.
అయితే ఇప్పుడు ఆ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులను 4Gకి తీసుకురావడానికి రిలయన్స్ జియో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ గత సంవత్సరం JioPhone Prima లాంచ్ చేసింది. ఇప్పుడు దానికి అప్‌డేటెడ్ వెర్షన్‌గా JioPhone Prima 2 మార్కెట్‌లో లాంచ్ చేయబడింది. ఇది జియో నుంచి ‘చౌక’ మొబైల్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, ఫేస్‌బుక్, జియో టీవీ, జియో సినిమా మొదలైన అనేక యాప్‌లకు మద్దతు ఉంది. JioPhone Prima 2 వెనుక వైపున ఒక కర్వ్డ్ డిజైన్, లెదర్ లాంటి ఫినిషింగ్‌ని కలిగి ఉంది.
JioPhone Prima 2 Features
Also Read: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ దేశీయ ధరలు.. ఫస్ట్ సేల్‌లో రూ.5000 భారీ తగ్గింపు!
JioPhone Prima 2 ఫీచర్ ఫోన్ అయినప్పటికీ వినియోగదారులను బాగా అలరిస్తుంది. ఇది Qualcomm ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Kai-OS పై రన్ అవుతుంది. దీని కారణంగా ఫీచర్ ఫోన్‌లలో YouTube, Facebook, JioTV, JioCinema వంటి యాప్‌లకు మద్దతు ఇస్తుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇందులో పనిచేస్తుంది. ఫోన్ వెనుక, సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది వీడియో కాలింగ్‌లో ఉపయోగించబడుతుంది. ఈ ఫోన్ లక్స్ బ్లూ కలర్‌లో ప్రవేశపెట్టబడింది. JioPhone Prima 2 సహాయంతో వినియోగదారు UPI చెల్లింపులను చేయగలరని కంపెనీ తెలిపింది.
చెల్లింపు చేయడానికి QR కోడ్‌ను కూడా స్కాన్ చేయవచ్చు. JioPhone Prima 2 ఫోన్ 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm ప్రాసెసర్‌తో పాటు, 512 MB RAM + 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. SD కార్డ్ ద్వారా స్టోరేజీని 128 GB వరకు పెంచుకోవచ్చు. ఇది వెనుక కెమెరా, 0.3MP ఫ్రంట్ VGA కెమెరాను కలిగి ఉంది. LED టార్చ్ అందుబాటులో ఉంది. 3.5mm ఆడియో జాక్, FM రేడియోను కలిగి ఉంది. దీని ద్వారా వినియోగదారులు JioPay UPIని యాక్సెస్ చేయవచ్చు. ఇందులో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 23 భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.
JioPhone Prima 2 India Price
JioPhone Prima 2 ధర విషయానికొస్తే.. ఇది కేవలం రూ.2799 ధరలోనే రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇది అతి త్వరలో JioMart, Reliance Digitalతో సహా రిటైల్ స్టోర్లలో కూడా సేల్‌కు రానుంది.