BigTV English

NTR: జాన్వీని ఇబ్బంది పెట్టిన ఎన్టీఆర్.. సెట్ లో అలా చేస్తూ.. ?

NTR: జాన్వీని ఇబ్బంది పెట్టిన ఎన్టీఆర్.. సెట్ లో అలా చేస్తూ.. ?

NTR: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం దేవర నామ జపం చేస్తుంది.  ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర.  ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు   యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవర సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ఎన్నో వాయిదాల తరువాత   దేవర సెప్టెంబర్  27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో  నేడు దేవర  ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్  ముంబైలో జరుగుతుంది. దీనికోసం  డైరెక్టర్ కొరటాల  శివ, ఎన్టీఆర్ ఇప్పటికే ముంబైకు చేరుకున్నారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్.. జాన్వీ కపూర్ ను ఇబ్బందిపెట్టినట్లు ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  సెట్ కు సరైన సమయానికి రాకుండా.. ఎన్టీఆర్, జాన్వీని ఎదురుచూసేలా చేసాడట.  ఏం మాట్లాడుతున్నారు.. నందమూరి కుటుంబం ఎప్పుడు  సెట్ కు సమయానికి  వస్తుంది..  ఆలస్యం చేయడమేంటి.. ? అని  ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ, ఎన్టీఆర్.. కొన్ని కొన్ని సమయాల్లో జాన్వీని ఎదురుచూసేలా చేశాడు అని చెప్పుకురావడం మాత్రం వాస్తవమే అని అంటున్నారు. సెట్ కు టైమ్ కు రాకుండా .. జాన్వీ టైమ్ ను వేస్ట్  చేశాడట. దీని వలన ఆమె చాలా ఇబ్బంది పడిందని చెప్పుకొస్తున్నారు.


ఇప్పటివరకు ఎన్టీఆర్  సెట్ లో డైరెక్ట్ గా డ్యాన్స్ చేయడమే తప్ప.. ప్రాక్టీస్ చేసిన దాఖలాలు లేవు. కానీ, జాన్వీ మాత్రం ఎన్టీఆర్ తో డ్యాన్స్ అనగానే ముందుగానే ప్రాక్టీస్ చేసిందట. ఈ విషయాన్నీ ఆమె నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆమె కొద్దిగా ముందు వచ్చి ఎన్టీఆర్ కోసం ఎదురుచూసి ఉండొచ్చు.   ఎన్టీఆర్ లేట్ గా రావడంతో ఇబ్బంది పడి ఉండొచ్చు. అంతే తప్ప సెట్ కు టైమ్ కు వచ్చే విషయంలో ఎన్టీఆర్ ను తప్పు పట్టలేమని కొందరు అంటున్నారు.

ఏదిఏమైనా  ఎన్టీఆర్ ప్రవర్తన వలన జాన్వీ ఇబ్బంది పడింది అన్నది మాత్రం వాస్తవమని, కాకపోతే ఆమె ఏరికోరి  ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో.. జాన్వీ సైతం వీటి గురించి పట్టించుకోలేదని టాక్. ఇంకోపక్క సినిమాలో కూడా ఈ చిన్నదానికి అంత ప్రాధాన్యత ఏమి లేదన్న మాట వినిపిస్తుంది. సాంగ్స్ కు తప్ప యాక్షన్ లో ఎక్కడా తంగం తలదూర్చలేదని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది సినిమా చూసిన తరువాతనే తెలుస్తుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదు.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×