E-Paper
Advertisement

జియో ఎగిరిగంతేసే ప్లాన్.. కేవలం రూ.55 కే 1,000+ ఛానళ్లు.. ఏమేం చూడొచ్చో తెలుసా?

జియో ఎగిరిగంతేసే ప్లాన్.. కేవలం రూ.55 కే 1,000+ ఛానళ్లు.. ఏమేం చూడొచ్చో తెలుసా?
Advertisement

JioTV Pro: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం సరికొత్త బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మొబైల్‌లోనే టీవీ ఛానళ్లను చూడాలనుకునే వారి కోసం కేవలం రూ. 55 ధరకే ‘జియోటీవీ ప్రో’ (JioTV Pro) ప్యాక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో ఎక్కువ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్యాక్ ద్వారా ఏకంగా 1,000 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశాన్ని జియో కల్పిస్తోంది.

అసలు రూ. 55 ప్లాన్‌లో ఏముంది?

పూర్తి వినోదానికి సంబంధించిన ఈ రూ.55 జియో టీవీ ప్యాక్ ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ద్వారా జియోటీవీ మొబైల్ యాప్‌లో 16 కంటే ఎక్కువ భాషల్లోని 1,000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే ఇది కేవలం యాడ్ఆ న్ ప్యాక్ మాత్రమే. కాబట్టి ఇందులో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఇంటర్నెట్ డేటా బెనిఫిట్స్ లభించవు. ఇందులో కేవలం 10MB నామమాత్రపు డేటా మాత్రమే వస్తుంది.

ప్రీమియం ఛానళ్లు ఇవే!

Advertisement

ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సాధారణ ఛానళ్లతో పాటు 150 కంటే ఎక్కువ ప్రీమియం ఛానళ్లు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని ప్రముఖ నెట్‌వర్క్‌లైన జియోస్టార్, సోనీ, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీకి చెందిన ప్రముఖ ఛానళ్లను ఇందులో చూడొచ్చు. స్టార్ ప్లస్ HD, కలర్స్ HD, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ HD, సోనీ సబ్ HD, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి ఎన్నో టాప్ ఛానళ్లు ఇందులో ఉన్నాయి.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేయడానికి ఎలాంటి ప్రత్యేకమైన ప్రాసెస్ అవసరం లేదని జియో వర్గాలు చెబుతున్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 55 ప్యాక్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. రీఛార్జ్ విజయవంతం అయిన వెంటనే ఫోన్ లో ‘JioTV’ యాప్‌ను ఓపెన్ చేయాలి. జియో నంబర్‌తో లాగిన్ అయితే ప్రీమియం ఛానళ్లతో సహా అన్ని లైవ్ ఛానళ్లు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతాయి. వెంటనే స్ట్రీమింగ్ స్టార్ట్ చేయవచ్చు.

ఈ ప్యాక్‌కు ఎవరు అర్హులు?

Advertisement

ఈ ‘జియోటీవీ ప్రో’ ప్యాక్‌ను జియో ప్రీపెయిడ్ (Prepaid), పోస్ట్‌పెయిడ్ (Postpaid) యూజర్లు ఇద్దరూ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్యాక్ పనిచేయాలంటే మీ నంబర్‌పై ఏదైనా ఒక యాక్టివ్ ప్లాన్ కచ్చితంగా ఉండాలి. అలాగే ఈ సబ్‌స్క్రిప్షన్ కేవలం ఒకే ఒక్క మొబైల్ డివైజ్‌లో మాత్రమే పనిచేస్తుంది.

Also Read: 70 ఏళ్ల ఇడ్లీ మాస్టర్..56 ఏళ్లుగా అదే రుచి.. ప్లేట్ ఇడ్లీ రూ.5 మాత్రమే!

ఎక్కువసార్లు రీఛార్జ్ చేస్తే?

ఒకవేళ ఈ రూ. 55 ప్యాక్‌ను ఒకసారికి బదులు రెండు లేదా మూడు సార్లు రీఛార్జ్ చేసుకున్నా డబ్బులు వృథా కావని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్లాన్లు క్యూలో ఉంటాయని తెలియజేస్తున్నాయి. అంటే మొదటి 30 రోజుల వ్యాలిడిటీ ముగిసిన వెంటనే తర్వాతి ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రతి నెలా రీఛార్జ్ చేయాలనే సమస్య ఉండదని వరుసగా వినోదాన్ని ఆస్వాదించవచ్చని వివరిస్తున్నారు.

Also Read: పేస్ బౌలింగ్ కు భ‌య‌ప‌డి, శివమ్‌ దూబేను డ‌గౌట్ లో దాచిపెడుతున్నారు

Related News

హోటల్ రూమ్స్‌లో ‘గ్లాస్ బాత్‌రూమ్స్’ ఎందుకు ఉంటాయో తెలుసా? ప్రైవసీ కంటే ఆ రీజనే ముఖ్యమా?

ఇల్లు చిన్నదా? బడ్జెట్ తక్కువా? అయితే.. ఈ వాషింగ్ మెషీన్స్ లిస్ట్ మీ కోసమే!

క్లీనింగ్ కష్టాలు లేవు,ప్లేట్లు అంటుకోవు..హెవీ డ్యూటీ నాన్-స్టిక్ శాండ్‌విచ్ మేకర్స్!

ఓర్నాయనో.. ఒక్క ఛార్జ్‌తో వంద గంటలా ?బడ్జెట్లో టాప్ 5 నెక్ బ్యాండ్స్ ఇవే!

మధ్యతరగతి స్పెషల్.. బడ్జెట్ ధరలో బెస్ట్ డిష్ వాషర్లు.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

కరెంట్ పోయినా నో టెన్షన్, రూ.11 వేలలోపే టాప్ బ్రాండెడ్ ఇన్వర్టర్ బ్యాటరీస్!

కరెంట్ బిల్లుకి చెక్.. కూరగాయలు ఫుల్ ఫ్రెష్! Whirlpool 200 L 3 Star ఫ్రిజ్ అదుర్స్!

Big Stories

Advertisement
×