56 Years of Tradition Rs.5 Idlis: ఈ రోజుల్లో చిన్న టిఫిన్ కూడా రూ.30-40 కంటే తక్కువకు దొరకడం కష్టమే. అhttps://www.bigtvlive.com/travel/this-70-year-old…ove-for-56-years.htmlలాంటిది ఒక వ్యక్తి గత 56 ఏళ్లుగా కేవలం రూ.5కే ప్లేట్ ఇడ్లీ అమ్ముతూ వేలాది మంది అభిమానాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాదు, ఇప్పటికీ గ్యాస్ స్టవ్ కాకుండా.. పాతకాలం కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు తయారు చేస్తుండటం మరింత విశేషం. ఈ ఇడ్లీ రుచి చూసేందుకు నిత్యం వందలాది మంది అక్కడ క్యూకడుతారు. ఇంతకీ ఆ ఇడ్లీ సెంటర్ ఎక్కడుందంటే..
కర్ణాటకలోని కనకపురలో ఉన్న ‘కోటె మానే ఇడ్లీ’ అనే చిన్న దుకాణం ఫుడ్ లవర్స్ కు హాట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. బెంగళూరు నుంచి కేవలం రెండు గంటల్లో చేరుకునే ఈ చోటుకు ప్రతిరోజూ ఇడ్లీ రుచి కోసం చాలా మంది వస్తుంటారు. ఈ దుకాణాన్ని 70 ఏళ్ల రామచంద్ర నడిపిస్తున్నారు. ఆయన తండ్రి శేషప్ప 1970లలో ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. అప్పట్లో 10 ఇడ్లీలను కేవలం ఒక రూపాయికే అమ్మేవారు. పదో తరగతి పూర్తయ్యాక, కేవలం 16 ఏళ్ల వయసులోనే రామచంద్ర తన తండ్రి బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
వయసు 70 దాటినా రామచంద్ర రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేస్తారు. స్వయంగా పిండిని సిద్ధం చేసి, సాంప్రదాయ కట్టెల పొయ్యిపై ఇడ్లీలను ఆవిరిలో తయారు చేస్తారు. ఉదయం ఆరు గంటల వరకు ఆయన వంటగదిలోనే బిజీగా ఉంటారు. ఈ పనిలో ఆయనకు కుమారుడు అనంత్, కోడలు నిరోషా కూడా తోడుగా ఉంటారు. ప్రతిరోజూ సుమారు 1,500 ప్లేట్ల ఇడ్లీలు తయారు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఒక్కో ప్లేట్ ఇడ్లీ ధర ఇప్పటికీ రూ.5 మాత్రమే. తక్కువ ధరతో పాటు, నాణ్యత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడకపోవడమే ఈ దుకాణం సక్సెస్ కు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
రామచంద్ర ఇడ్లీలకు ప్రత్యేక రుచి రావడానికి ఓ సీక్రెట్ ఉంది. బియ్యం, మినపప్పును సరైన నిష్పత్తిలో కలిపి పిండిని తయారు చేయడం, కట్టెల పొయ్యిపై ఉడికించడం వల్ల ఇడ్లీలకు ప్రత్యేకమైన సువాసన వస్తుంది. వాటితో పాటు ఇచ్చే ఘాటైన ఎర్ర చట్నీ కూడా కస్టమర్లకు బాగా నచ్చుతుంది. గుంటూరు, బైడగి మిరపకాయలు, పుదీనా, శనగపప్పుతో తయారయ్యే ఈ చట్నీ రుచిని మరింత పెంచుతుంది.
ఇంత వయసులోనూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారని అడిగితే రామచంద్ర చెప్పిన సమాధానం ఎంతో హృదయాన్ని తాకుతుంది. “పని చేయడం ఆపేస్తే నా జీవితమే అసంపూర్తిగా అనిపిస్తుంది. ప్రజలకు మంచి ఆహారం పెట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మా తండ్రి ప్రారంభించిన ఈ దుకాణాన్ని అలాగే కొనసాగించడం నా బాధ్యత” అంటారు. వంటగదిలో గంటల తరబడి నిలబడటం కొన్నిసార్లు అలసటను కలిగించినా, తన ఇడ్లీ కోసం దూరదూరాల నుంచి వచ్చే కస్టమర్లను చూస్తే ఆ అలసట అంతా మాయమైపోతుందని ఆయన అంటారు. డబ్బు సంపాదించడం కంటే, మంచి రుచి, నాణ్యత, వినియోగదారుల సంతృప్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రామచంద్రలాంటి వారు నిజంగా చాలా అరుదు. అందుకే చిన్న దుకాణమైనా, ఆయన ఇడ్లీ రుచి మాత్రం వేలాది మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Read Also: కారులో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. డ్రైవర్ చేసిన పనికి నెటిజెన్స్ ఫిదా!