E-Paper
Advertisement

ఓర్నాయనో.. ఒక్క ఛార్జ్‌తో వంద గంటలా ?బడ్జెట్లో టాప్ 5 నెక్ బ్యాండ్స్ ఇవే!

ఓర్నాయనో.. ఒక్క ఛార్జ్‌తో వంద గంటలా ?బడ్జెట్లో టాప్ 5 నెక్ బ్యాండ్స్ ఇవే!
Advertisement

Best neckband earphones 2026: ఈ రోజుల్లో జర్నీ చేసేటప్పుడు పాటలు వినాలన్నా,ఆఫీస్ కాల్స్ మాట్లాడాలన్నా మంచి ఇయర్‌ఫోన్స్ అత్యవసరంగా మారాయి. ఎయిర్‌పాడ్స్ లాంటివి పోగొట్టుకుంటామనే భయం ఎక్కువ, అందుకే చాలా మంది నెక్ బ్యాండ్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. లాంగ్ ట్రావెల్ చేసేవారికి ఎక్కువ బ్యాటరీ లైఫ్, రఫ్ అండ్ టఫ్ బాడీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఉండే ‘ఎండ్యూరెన్స్’ నెక్ బ్యాండ్స్ అవసరం. మీ ప్రయాణాలను మరింత హ్యాపీగా మార్చేసే 5 బెస్ట్ నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లిస్ట్..

టాప్ 5 ఎండ్యూరెన్స్ నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్:

1. బోట్ రాకర్జ్ 255 ఏఎన్‌సీ (boAt Rockerz 255 ANC):

లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ బోట్ దే. దీని ఎండ్యూరెన్స్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లాంగ్ జర్నీలకి ఇది ఒక పర్ఫెక్ట్ పార్టనర్. ఇందులో 32 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అంటే బస్సు లేదా ట్రైన్ జర్నీలో బయట వచ్చే గోల అసలు వినపడదు.

Advertisement

బ్యాటరీ లైఫ్: ఏకంగా 100 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 24 గంటలు వాడుకోవచ్చు.

స్పెషల్ ఫీచర్స్: 13mm డ్రైవర్స్, స్పాషియల్ ఆడియో, 3-మైక్ AI-ENx టెక్నాలజీ (కాలింగ్ కోసం).

Advertisement

ధర: రూ.1,599.

2. వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్3 (OnePlus Bullets Wireless Z3):

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్రేజీ నెక్ బ్యాండ్ ఇది. క్వాలిటీ, సౌండ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. జర్నీలో క్విక్ ఛార్జింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 27 గంటల బ్యాకప్ ఇస్తుంది.

స్పెషల్ ఫీచర్స్: 12.4mm డ్రైవర్స్, 3D స్పాషియల్ ఆడియో, బ్లూటూత్ 5.4, డైనమిక్ బాస్ ఎన్‌హాన్స్‌మెంట్.

ధర:  రూ.1,599

3. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5 ఏఎన్‌సీ (realme Buds Wireless 5 ANC):

రియల్‌మీ నుంచి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ మ్యూజిక్ లవర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో 50dB హైబ్రిడ్ ఏఎన్‌సీ ఉంది, ఇది ఈ బడ్జెట్లో చాలా ఎక్కువ. ప్రయాణాల్లో పక్కన ఎవరు ఎంత గట్టిగా మాట్లాడినా మీకు ప్రశాంతంగా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్: అప్-టు 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

స్పెషల్ ఫీచర్స్: 13.6mm పెద్ద డైనమిక్ బాస్ డ్రైవర్, 360° స్పాషియల్ ఆడియో, IP55 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్.

ధర:  రూ.1,799

4. నాయిస్ ఎయిర్‌వేవ్ ప్రో (Noise Airwave Pro):

తక్కువ బడ్జెట్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి బిల్డ్ క్వాలిటీ కోరుకునే ట్రావెలర్స్ కోసం నాయిస్ ఎయిర్‌వేవ్ ప్రో చక్కగా సూట్ అవుతుంది. దీని లుక్ అండ్ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది.

బ్యాటరీ లైఫ్: 60 గంటల భారీ ప్లేటైమ్‌తో వస్తుంది.

స్పెషల్ ఫీచర్స్: 30 dB ANC, 3-మైక్ ఈఎన్‌సీ (కాల్స్ కోసం), 13mm డ్రైవర్స్, 3 ఈక్వలైజర్ మోడ్స్.

ధర:  రూ.1,499

Also Read: కరెంట్ పోయినా నో టెన్షన్, రూ.11 వేలలోపే టాప్ బ్రాండెడ్ ఇన్వర్టర్ బ్యాటరీస్!

5. సోనీ డబ్ల్యూఐ-సీ100 (Sony WI-C100):
బ్రాండ్ వాల్యూ, ప్యూర్ క్రిస్టల్ క్లియర్ ఆడియో కావాలనుకునే వారికి సోనీ ఎప్పటికీ ఆల్‌టైమ్ ఫేవరెట్. ఇది చాలా లైట్ వెయిట్, మెడలో వేసుకుంటే అసలు ఉన్నట్టే తెలియదు. లాంగ్ ట్రిప్స్‌లో కంఫర్ట్‌కి కేరాఫ్ అడ్రస్ ఇది.

బ్యాటరీ లైఫ్: 25 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

స్పెషల్ ఫీచర్స్: సోనీ హెడ్‌ఫోన్స్ యాప్ సపోర్ట్ (ఈక్వలైజర్ మార్చుకోవచ్చు), DSEE అప్‌స్కేలింగ్, స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్.

ధర:  రూ.1,849

మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే.. పైన చెప్పిన వాటిలో ఏదైనా ఒకదాన్ని కళ్ళు మూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. భారీ బ్యాటరీ కావాలంటే boAt Rockerz 255 ANC, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే OnePlus Z3, పక్కా నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే Realme Buds 5 బెస్ట్ ఛాయిస్ అవుతాయి.

Related News

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Big Stories

Advertisement
×