Moeen Ali: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మూడు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ నాలుగవ టి20 బ్రిస్టల్ వేదికగా జరగనుంది. అయితే మొన్న మూడవ టి20 సందర్భంగా శివమ్ దూబేను కాదని, హర్షిత్ రాణాను పంపించడం పై విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఫైర్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే దీనిపై ఇంగ్లాండ్ క్రికెటర్ మాజీ మొయిన్ అలీ (Moeen Ali ) మాత్రం ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. శివం దుబేకు ఫేస్ బౌలింగ్ లో ఆడడం చేతకాదని… స్పిన్ బౌలింగ్ లో ఇరగదీస్తాడని పేర్కొన్నారు. అందుకే డగౌట్ లో శివమ్ దూబేను దాచి పెట్టారని బాంబు పేల్చారు. ఈ క్రమంలోనే హర్షిత్ రాణాను పంపించి, గౌతమ్ గంభీర్ కొత్త కుట్రకు తెర లేపాడని ఆరోపణలు చేశారు. ఆల్ రౌండర్ అన్నప్పుడు ప్రతీ బౌలర్ ను ఎదుర్కొవాలని చురకలు అంటించారు మొయిన్ అలీ. శివమ్ దూబేలాగా భయపడొద్దు అంటూ చురకలు అంటించారు.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్ మాజీ మొయిన్ అలీ (Moeen Ali ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ చేతిలో మూడవ టి20 లో టీమిండియా దారుణంగా ఓడిపోయిందని విమర్శలు చేశారు. దీనంతటికీ కారణం టీమిండియా మిడిల్ , లోయర్ ఆర్డర్ అంటూ వ్యాఖ్యానించారు. మూడవ టి20 లో 8వ వికెట్ కు శివం దుబేను పంపడం ఏంటని నిలదీశారు. ఆల్ రౌండర్ గా పేరు ఉన్న శివం దుబేను అనవసరంగా 8వ వికెట్ కు పంపి.. గౌతమ్ గంభీర్ పెద్ద తప్పిదం చేశాడన్నారు.
స్పిన్నర్ల బౌలింగ్ లో శివం దుబే బాగా ఆడతాడన్న ఒక్క కారణంతో… డగౌట్ లో అతడిని దాచారని ఫైర్ అయ్యారు. అలా కాకుండా మూడవ టి20లో ముందుగా శివం దుబే ను పంపించి ఉంటే మెరుగైన ఫలితం వచ్చేదని తెలిపారు. ఓపెనర్లను తిట్టాల్సిన పనిలేదని.. వాళ్లు క్లిక్ అయితే టీమిండియాను ఆపడం కష్టమేనన్నారు. వచ్చిందంట మిడిల్, లోయర్ ఆర్డర్ గురించేనన్నారు. హర్షిత్ రాణాకు ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఆగ్రహించారు. బౌలర్ ను బౌలర్ లాగే చూడాలని.. ఆల్ రౌండర్ చేసే ప్రయత్నం చేయకూడదని చురకలు అంటించారు ఇంగ్లాండ్ క్రికెటర్ మాజీ మొయిన్ అలీ (Moeen Ali ). ఇలాగే టీమిండియా ప్రదర్శన ఉంటే, వైట్ వాష్ తప్పదని హెచ్చరించారు.