E-Paper
Advertisement

నిస్సాన్ టెక్టన్ వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో అన్ని క్రేజీ ఫీచర్లా?

నిస్సాన్ టెక్టన్ వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో అన్ని క్రేజీ ఫీచర్లా?
Advertisement

2026 Nissan Tecton Launched: ఇండియన్ కార్ మార్కెట్‌ లోకి మరో కొత్త ఎస్‌యూవీ అడుగుపెట్టింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిస్సాన్ టెక్టన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 20 నుంచి కస్టమర్లకు డెలివరీలు ఇవ్వనున్నారు.

ఆకట్టుకుంటున్న డిజైన్

డిజైన్ విషయానికి వస్తే, టెక్టన్ చాలా స్టైలిష్‌ గా కనిపిస్తుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, LED హెడ్‌ ల్యాంప్స్, కనెక్టెడ్ LED DRLs, సూపర్ బంపర్ దీనికి బోల్డ్ లుక్‌ ను ఇస్తాయి. వెనుక భాగంలో విశాలమైన LED లైట్ బార్, కొత్త టెక్టన్ బ్యాడ్జింగ్, రూఫ్ స్పాయిలర్ ఈ ఎస్‌యూవీని మరింత ప్రీమియం లుక్ ను కలిగిస్తున్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే రెడ్, బ్లూ, గ్రే, బ్లాక్, సిల్వర్, వైట్ లాంటి మోనోటోన్ రంగులతో పాటు డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఇంటీరియర్ కూడా అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. టాప్ వేరియంట్లలో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ ఇంటిగ్రేషన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదే కాకుండా పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌ గేట్, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందించారు.

లేటెస్ట్ భద్రతా ఫీచర్లు

భద్రత విషయంలో కూడా టెక్టన్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్,  ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌ తో పాటు లెవెల్-2 ADAS లాంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

రెండు టర్బో పెట్రోల్ ఆప్షన్లు

Advertisement

ఇంజిన్ పరంగా కొనుగోలుదారులకు రెండు టర్బో పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.0 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 100 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.3 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 163 bhp పవర్‌ ను అందిస్తుంది. రెండు ఇంజిన్లతో మాన్యువల్ గేర్‌ బాక్స్ లభిస్తుంది. అలాగే 1.3 లీటర్ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, పవర్ ఫుల్ టర్బో ఇంజిన్లు, ప్రీమియం ఇంటీరియర్, అధునాతన భద్రతా  సౌకర్యాలతో వచ్చిన నిస్సాన్ టెక్టన్… మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

విదేశాలకూ ఇక్కడి నుంచే ఎగుమతి

నిస్సాన్ మాగ్నైట్ తర్వాత భారత మార్కెట్‌ లోకి వచ్చిన రెండో మోడల్ ఇదే. చెన్నైలోని రెనాల్ట్ నిస్సాన్ ప్లాంట్‌ లో ఈ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. భారత మార్కెట్‌ తో పాటు విదేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేయనున్నారు. కొత్త టెక్టన్ నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనుంది.

Read Also: టాటా పంచ్ కొనేవారికి బ్యాడ్ న్యూస్.. అన్ని వేరియంట్లపై ధరల పెంపు!

Related News

పెట్రోల్ ఏరాక్స్‌ కు గుడ్‌బై.. యమహా ఏరాక్స్-E వచ్చేసింది!

E20 పెట్రోల్‌ వివాదం.. ఇప్పుడు అందరి ఫోకస్ XP100 ప్యూయల్ పైనే.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?

ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!

టాటా పంచ్ కొనేవారికి బ్యాడ్ న్యూస్.. అన్ని వేరియంట్లపై ధరల పెంపు!

అసభ్య ప్రకటనల దుమారం.. క్షమాపణ చెప్పిన చైనా ఈ-బైక్ కంపెనీ!

మీ పాత కారులో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ARAI రిపోర్ట్ ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×