BigTV English
Advertisement

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Oneplus Diwali Sale: ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus India దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో వంటి ఎలక్ట్రానిక్ ప్రొడెక్టులతో సహా దాని ఇతర ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందిస్తోంది. ఈ ఆఫర్లతో అధిక ధరలో ఉన్న ప్రొడక్టులు మరింత తక్కువకు లభిస్తాయి. ఈ సేల్ సెప్టెంబర్ 26, 2024న ప్రారంభమవుతుంది.


OnePlus.in, Amazon.in, Flipkart, Myntra, Blinkit వంటి అనేక ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో, రిలయన్స్ డిజిటల్, క్రోమాతో సహా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో స్పెషల్ డిస్కౌంట్‌లతో లభిస్తున్నాయి. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 రూ.7,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు పొందుతుంది. అదే సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.3,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు అందిస్తుంది. అలాగే ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఇంకా ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,000 తగ్గింపు కూడా లభిస్తుంది. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు 8+256GB వేరియంట్‌పై అదనంగా రూ.2,000 తగ్గింపును పొందుతారు. ఈ ఆఫర్‌లు OnePlus.in, Amazon.in, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు OnePlus Nord 4పై రూ.2,000 తక్షణ బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI పొందుతారు.


Also Read: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

వివిధ మోడళ్ల కోసం అదనంగా రూ.1000 ప్రత్యేక కూపన్ కోడ్‌ అందుబాటులో ఉంది. ఇంకా OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు OnePlus Nord Buds 2Rను కూడా రూ.1,500 తాత్కాలిక ధర తగ్గింపు, రూ.1,500 తక్షణ బ్యాంక్ తగ్గింపుతో కొనుక్కోవచ్చు. మూడు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై కాంప్లిమెంటరీ తగ్గింపు ఉంది.

అలాగే OnePlus ఓపెన్ అపెక్స్ ఎడిషన్ OnePlus వాచ్ 2పై రూ.20,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు పొందుతుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లతో 12 నెలల వరకు నో-కాస్ట్ EMI పొందొచ్చు. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అదనంగా రూ.5000 తగ్గింపు వర్తిస్తుంది. ఇంకా OnePlus Pad 2 ఆఫర్‌లో రూ.3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ఉంది.

మొబైల్/టాబ్లెట్ ఎక్స్‌ఛేంజ్‌తో అదనంగా రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. అలాగే రూ.2,000 ధర తగ్గింపు కూడా పొందొచ్చు. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు వరుసగా రూ.1,500, రూ.1,000 అదనపు తగ్గింపులను పొందవచ్చు. అంతేకాకుండా, OnePlus బడ్స్ ప్రో 2, నార్డ్ బడ్స్ 2R, BWZ 2తో సహా ఇతర ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేకమైన డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఎప్పట్నుంచో మంచి ఆఫర్ కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్స్ బెస్ట్‌గా చెప్పుకోవచ్చు.

Related News

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

Big Stories

×