BigTV English

Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 ట్యాబ్..లిమిటెడ్ టైమ్ డీల్!

Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 ట్యాబ్..లిమిటెడ్ టైమ్ డీల్!

Best Budget Tablets: ప్రస్తుత రోజుల్లో టాబ్లెట్‌లు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో అనేక మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆఫీసు పనులు, గేమింగ్, చదువు, లేదా సినిమా చూడడం వంటి అనేక పనులను టాబ్లెట్ ద్వారా నిర్వహించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు మంచి ఫీచర్లు, పనితీరు, అద్భుతమైన డిస్‌ప్లేతో కూడిన టాబ్లెట్ కొనాలని చూస్తే లెనోవో ట్యాబ్ M11 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ట్యాబ్లెట్ ప్రస్తుతం 58% తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో దీని ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వైడ్ డిస్‌ప్లే & అద్భుతమైన విజువల్స్
లెనోవో ట్యాబ్ M11లో 11 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో, మీరు వీడియోలు, గేమింగ్ సహా అనేక పనులను నిర్వహించుకోవ్చచ్చు. 72% NTSC కలర్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో, ఈ ట్యాబ్లెట్ అద్భుతమైన కంటెంట్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇక ఇంట్లో లేదా బయట ఎక్కడైనా, ఈ డిస్‌ప్లే మీరు చూసే అన్ని విషయాలను స్పష్టంగా చూపిస్తుంది.

అద్భుతమైన పనితీరు
ఈ ట్యాబ్లెట్‌లో 8GB RAM, 128GB ROM మీకు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. మీరు యాప్స్ ని ఫాస్ట్‌గా ఓపెన్ చేయవచ్చు, లాగ్స్ లేకుండా మల్టీటాస్కింగ్‌ను చేయవచ్చు. ఇందులో ఉన్న ఆప్టా-కోర్ ప్రాసెసర్, మీరు వేగవంతమైన అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. మీ డేటా, మెమరీ కోసం 1TB వరకు మైక్రో SD కార్డ్‌ సపోర్ట్ చేస్తుంది. దీంతో మీరు ఎక్కువగా డేటాను నిల్వ చేసుకోవచ్చు.


డాల్బీ అట్మోస్‌ సౌండ్
ఈ ట్యాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్లను డాల్బీ అట్మోస్‌తో కలిపి ఇవ్వడం వలన, మీరు సినిమాలు లేదా పాటలు వినేటప్పుడు, అద్భుతమైన ఆడియో అనుభవాన్ని పొందుతారు. కేవలం టాబ్లెట్‌గా కాకుండా, మ్యూజిక్ లేదా వీడియోలు చూసేటప్పుడు చాలా ఉత్తమమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా
ఈ ట్యాబ్లెట్‌లో 13MP రియర్ కెమెరా ఉంది, దీని ద్వారా మీరు మంచి ఫోటోలు తీసుకోవచ్చు. మీరు ఈ గ్యాడ్జెట్‌ను ఎక్కువగా ఎడ్యుకేషన్, వీడియో కాల్స్, వీడియో బ్లాగ్‌లు వంటి ఉపయోగాల కోసం వినియోగించుకోవచ్చు.

డిజైన్ & బిల్డ్
లెనోవో ట్యాబ్ M11 లైట్‌వెయిట్, స్లిమ్, ప్రీమియమ్ ఫినిష్‌తో వస్తుంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, పోర్టబులిటీని కూడా పెంచుతుంది. మీరు ఎక్కడైనా ఈ ట్యాబ్లెట్‌ను తేలికగా తీసుకెళ్లవచ్చు.

వై-ఫై సపోర్ట్
ఈ ట్యాబ్లెట్ Wi-Fi మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా ఆన్‌లైన్ విద్యా అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు మీ ఇంటర్నెట్ ప్లాన్‌పై ఆధారపడి ఉన్నప్పుడు, దీనితో అధిక స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు.

బ్యాటరీ
లెనోవో ట్యాబ్ M11 స్థిరమైన బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది మీ డే లాంగ్ వినియోగానికి సరిపోతుంది. దీని ద్వారా మీరు వీడియోలను వీక్షించడానికి లేదా వర్క్ చేసేందుకు అనేక గంటలు బ్రేక్ లేకుండా ఉపయోగించవచ్చు.

ధర, లభ్యత
దీని అసలు ధర రూ.31,000 ఉండగా, ప్రస్తుతం అమెజాన్లో 58% తగ్గింపు ఆఫర్ ఉంది. దీంతో మీరు దీనిని 12,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×