Wedding infront Deadbody| ఎక్కడాలేని విధంగా ఒక యువకుడు ఇంట్లో శవం ఎదుట తన ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. ఒకవైపు ఇంట్లో అందరూ పట్టరాని దు:ఖంతో ఉంటే అతను తన వివాహానికి అదే సరైన సమయం అని భావించాడు. ఈ విచిత్ర ఘటన తమిళనాడుతో జరిగింది.
తమిళనాడుకు చెందిన ఒక యువకుడు ఇంట్లో తన తండ్రి మృతదేహం పెట్టుకొని ప్రియురాలితో అదే సమయంలో వివాహం చేసుకుంటానని చెప్పాడు. అందుకోసం అందరికీ చెప్పి ఒప్పించాడు కూడా. తన తండ్రిపై ఉన్న ప్రేమ, గౌరవం కోసమే అలా చేశాడు. తండ్రి తనను ఎంత కష్టపడి చదివించాడో, తన జీవితంలో ఆయనకు ఉన్న ప్రాధాన్యం ఉందో చూపించేందుకు ఆయన మృతదేహం ముందు తన ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తండ్రి ఆశీర్వాదాలు తనపై ఉండాలని భావించిన యువకుడు, ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులోని విరుధాచలం సమీపంలోని కవణై గ్రామంలో చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో రెండు కుమారుడు అప్పు న్యాయ విద్య అభ్యస్తిస్తున్నాడు. అయితే చదువుకునే సమయంలో అప్పు.. విజయశాంతి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. విజయశాంతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. ఇద్దరూ తమ ప్రేమను కుటుంబాలకు తెలిపి, పెద్దల అంగీకారంతో త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే అనుకోని విధంగా అప్పు తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. బుధవారం రాత్రి అప్పు తండ్రి సెల్వరాజ్ తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో తీవ్రంగా బాధపడిన అప్పు, దహనక్రియలు ప్రారంభించకముందే ఒక ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి మృతదేహం ముందు, తన ప్రియురాలైన విజయశాంతి మెడలో మంగళసూత్రం కట్టి ఆమెను భార్యగా చేసుకున్నాడు. అలా చేస్తే తన తండ్రి ఆశ్వీరాదం తమకు ఉంటుందని అతడి అభిప్రాయం.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
వధూవరులను అప్పు తల్లి, గ్రామస్థులు ఆశీర్వదించారు. కానీ, వధువు తరఫున ఎవ్వరూ అక్కడ హాజరుకాలేకపోయారు. తండ్రి వియోగంతో తీవ్ర విచారంలో ఉన్నప్పటికీ, అప్పు తన ప్రేమను పెళ్లిగా మార్చుకుని తండ్రి ఆశీర్వాదంతో జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నాడు. అందుకు అతని ప్రియురాలిని ఒప్పించాడు కూడా. ఇది కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు కానీ, తన జీవితానికి తండ్రి ఆశీస్సుల కోసమే ఇలా చేశాడు.
అయితే ఈ వివాహానికి అప్పు ప్రియురాలు కూడా అంగీకరించి తాను చేసిన నిర్ణయానికి మద్దతుగా నిలవడం గొప్ప విషయమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దేవాలయంలో జరుగుతున్న పెళ్లిని అడ్డుకున్న భక్తులు
కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఓ వివాహ వేడుక అర్థాంతరంగా నిలిచిపోయింది. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పెళ్లిని అక్కడి భక్తులు అడ్డుకున్నారు. 22 ఏళ్ల యువతిని 42 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి ఏర్పాట్లు జరుగుతుండగా, భక్తులు, భద్రతా సిబ్బంది ఇది గమనించారు. పెళ్లి మండపంలో కూర్చున్న యువతి ఏడుస్తుండటాన్ని చూసిన వారు ఆ పరిస్థితిని అనుమానాస్పదంగా భావించారు.
అందుకే పెళ్లికూతురిని ప్రశ్నించిగా ఆమె తన ఇష్టానికి విరుద్ధంగా ఈ పెళ్లి జరగుతోందని బాధతో తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న భక్తులు, భద్రతా సిబ్బంది వెంటనే పెళ్లిని ఆపేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని, వధూ వరుల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.