E-Paper
Advertisement

OTT Movie : కామన్ మ్యాన్ కి కోపం వస్తే… సీను సీనుకూ ట్విస్టులే… మెంటల్ మాస్ మూవీ మావా

OTT Movie : కామన్ మ్యాన్ కి కోపం వస్తే… సీను సీనుకూ ట్విస్టులే… మెంటల్ మాస్ మూవీ మావా
Advertisement

OTT Movie : ఈ ఏడాది బంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీ అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అయిన ‘తాండవ్’ సినిమా, ఇప్పటికే 2025లో బంగ్లాదేశ్‌లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. మొత్తనికి అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఒక టివి ఛానల్ అటాక్ తో మొదలయ్యే ఈ స్టోరీ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బాక్సాఫీస్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

రైహాన్ రఫీదర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పేరు ‘తాండవ్’ (Taandob) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 2025 జూన్ 7న ఈద్-ఉల్-అధా సందర్భంగా విడుదలైంది. ఇందులో షకీబ్ ఖాన్, సబిలా నూర్, జయ అహ్సాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 9 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.7/10 రేటింగ్ పొందింది. ఆల్ఫా-ఐ బ్యానర్‌పై షహ్రియార్ షకీల్ దీనిని నిర్మించారు.

Advertisement

Read Also : ఒకడికి తెలీకుండా మరొకరితో రిలేషన్… బాయ్ ఫ్రెండ్ మర్డర్ తో మిస్టరీ ట్విస్ట్… ట్విస్టులే ట్విస్టులు

స్టోరీ ఏమిటంటే

ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సాధారణ యువకుడు మిఖాయిల్జీ. కుటుంబానికి అండగా ఉండేందుకు మంచి ఉద్యోగం కోసం ఢాకాకు వస్తాడు. కానీ అక్కడి రియాలిటీ అతన్ని షాక్ చేస్తుంది. అతని జీవితం సడన్‌గా మారిపోతుంది. ఇదే సమయంలో ఒక పెద్ద టీవీ చానెల్ ఆఫీస్ మీద దాడి జరుగుతుంది. మాస్క్‌లు ధరించిన ఒక గ్రూప్, చానెల్ ఆఫీస్‌ను ఆక్రమించి, స్టాఫ్ తో పాటు, ఇంటర్వ్యూ కోసం అక్కడికి వచ్చిన ఒక ప్రముఖ మంత్రిని కూడా బందీలుగా చేస్తారు. ఇదంతా లైవ్ ట్రాన్స్‌మిషన్‌లో జరుగుతుంది. దీన్ని పూర్తి దేశం చూస్తుంటుంది. పోలీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాడి వెనక మాస్టర్‌మైండ్ ఎవరు? ఎందుకు చేశారు? అనే దాని మీద ఫుల్ ఫోకస్ చేస్తాయి.

Advertisement

ఈ దాడి జరిగిన తర్వాత, మాస్టర్‌మైండ్ తనను తాను లైవ్‌లో రివీల్ చేస్తాడు. అతను దేశంలోని హై-లెవల్ అవినీతి వల్ల సామాన్య ప్రజల కథలు ఎక్స్‌పోజ్ చేస్తాడు. ఇది కేవలం ఒక టెర్రర్ అటాక్ కాదు. ఇది సోషల్ మెసేజ్తో కూడిన పొలిటికల్ స్టేట్‌మెంట్! కానీ ఈ రివీలేషన్ మరింత చీకటి కాన్స్‌పిరసీని ఓపెన్ చేస్తుంది. ఈ దాడిలో మిఖాయిల్ మెయిన్ ఆరోపితుడిగా మారతాడు. అతను నిర్దోషి, కానీ ఎవరో అతన్ని ఫ్రేమ్ చేసి టార్గెట్ చేస్తారు. ఢాకాలో పోలీస్ చేజ్‌లో పడి, మిఖాయిల్ ఒంటరిగా తన పేరు క్లియర్ చేసుకోవాలని సెల్ఫ్-ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి స్టోరీ ఉత్కంఠతను మరింత పెంచుతుంది. చివరికి టీవీ చానెల్ మీద దాడి చేసింది ఎవరు ? మిఖాయిల్ కి దీని కనెక్షన్ ఉందా ? అతన్ని ఇరికించారా ? ఈ కథ ముగింపు ఏమిటి ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను చూసి తెలుసుకోండి.

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×