Big Stories

Microplastics:- చేపల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్..

Microplastics:- ప్లాస్టిక్ అనేది కేవలం మానవాళికే కాదు.. భూమిపైన జీవిస్తున్న ప్రతీ జీవరాశికి ప్రమాదకరమే. అంతే కాకుండా పర్యావరణానికి హాని కలిగించే ఎన్నో విషయాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా సముద్ర తీరాల్లో ఉండే ప్లాస్టిక్ సముద్రాల్లోకి వెళ్లి చేపలకు చాలా ప్రాణహాని కలిగిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది.

- Advertisement -

ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్స్ అనేవి పర్యావరణానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. సముద్ర తీరాలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే అలా బీచ్‌కు వెళ్లి చిల్ అవ్వాలనుకునే వారు చాలామంది ఉంటారు. అలా బీచ్‌లకు టూరిస్ట్‌ల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల అవి చాలా కాలుష్యానికి లోనవుతున్నాయి. అవి మెల్లగా సముద్రాల్లోకి వెళ్లడం వల్ల.. అందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ ఒకటి కాదు.. ఎన్నో విధాలుగా చేపల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని తెలిసింది. తాజాగా అవి చేసే హానిపై శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధనలు మొదలుపెట్టారు.

- Advertisement -

మైక్రోప్లాస్టిక్స్ అనేవి చేపల ప్రవర్తన దగ్గర నుండి మెదడు డెవలప్‌మెంట్ వరకు అన్నింటిపై ప్రభావం చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు కలిగిస్తాయని చెప్తున్నా కూడా అవి ఎలాంటి సమస్యలు అని శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా నిర్ధారణకు రాలేకపోతున్నారు. ప్లాస్టిక్స్ అనేవి జంతువుల ప్రాణాలకు హాని కలిగిస్తుందని తెలిసినా కూడా అవి కొన్ని ప్రాణాంతక వ్యాధులకు కూడా దారితీస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మైక్రోప్లాస్టిక్స్ వల్ల చేపలు ఒక ప్రాణాంతకమైన వైరస్‌కు గురవుతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ సోకిన చేపలు చాలావరకు చచ్చిపోతాయని వారి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా ఇలాంటి వాటికి ప్లాస్టిక్సే కారణమని తెలుస్తోంది. ఈ పరిశోధనల కోసం ఎన్నో చేపల టిష్యూ శాంపిల్స్‌ను తీసుకున్నారు శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్స్ వల్ల చాలావరకు చేపల శరీర భాగాలు దెబ్బతిన్నాయని వారు గుర్తించారు. అలా దెబ్బతిన్నప్పుడు వైరస్.. ఈ చేపల శరీరాల్లో వెళ్లడం తేలికవుతుంది. అప్పుడే వైరస్‌తో పాటు మరెన్నో ప్రాణాంతక వ్యాధులకు ప్లాస్టిక్స్ కారణమవుతున్నాయి.

తేలికైన పెయింట్.. శతాబ్దాల వరకు చెరిగిపోకుండా..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News